TG Inter Time Table 2027: తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..?

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు కీలక అప్‌డేట్. 2027 ఇంటర్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 24 నుంచి ఫస్టియర్, ఫిబ్రవరి 25 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల పూర్తి తేదీలు, సమయాలు మరియు ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి..

TG Inter Time Table 2027: తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..?
Telangana Inter Time Table 2027

Updated on: Nov 20, 2026 | 6:41 AM

హైదరాబాద్‌, నవంబర్ 20: తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. 2027 మార్చి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) విడుదల చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షల తేదీలతో పాటు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం థియరీ పరీక్షలు 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మొదలవుతాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 19తో ముగియనుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 20తో ముగియనున్నాయి. పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా తేదీలను బోర్డు విడుదల చేసిన తాత్కాలిక టైమ్‌టేబుల్‌లో పొందుపరిచింది.

ప్రాక్టికల్ పరీక్షల తేదీలు ఇవే!

ఇంటర్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆదివారాలతో సహా ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. అలాగే ప్రథమ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు కొత్త ప్యాటర్న్ ప్రకారం ఫిబ్రవరి 11 నుంచి 18వ తేదీ వరకు మూడు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్ రెండు గంటల పాటు ఉంటుంది.

ప్రాక్టికల్ పరీక్షల సమయాలు

  • మొదటి సెషన్: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
  • రెండో సెషన్: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 29న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జనవరి 30న నిర్వహించనున్నారు. అదేవిధంగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 27న ఇదే సమయానికి జరగనుంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ టైం టేబుల్..

  • 24-02-2027 (బుధవారం) సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
  • 26-02-2027 (శుక్రవారం) ఇంగ్లీష్ పేపర్-1
  • 02-03-2027 (మంగళవారం) మ్యాథమెటిక్స్-1A, బోటనీ-1, పొలిటికల్ సైన్స్-1, అకౌంటెన్సీ పేపర్-1
  • 05-03-2027 (శుక్రవారం) మ్యాథమెటిక్స్-1B, జువాలజీ-1, హిస్టరీ-1, కామర్స్ పేపర్-1
  • 09-03-2027 (మంగళవారం) ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1
  • 15-03-2027 (సోమవారం) కెమిస్ట్రీ-1, కామర్స్ & అకౌంటెన్సీ పేపర్-1
  • 17-03-2027 (బుధవారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, మ్యాథమెటిక్స్-1 (సింగిల్ పేపర్)
  • 19-03-2027 (శుక్రవారం) మోడర్న్ లాంగ్వేజ్-1, జాగ్రఫీ-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్-1

ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ టైం టేబుల్..

  • 25-02-2027 (గురువారం) సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
  • 27-02-2027 (శనివారం) ఇంగ్లీష్ పేపర్-2
  • 03-03-2027 (బుధవారం) మ్యాథమెటిక్స్-2A, బోటనీ-2, పొలిటికల్ సైన్స్-2
  • 08-03-2027 (సోమవారం) మ్యాథమెటిక్స్-2B, జువాలజీ-2, హిస్టరీ-2
  • 12-03-2027 (శుక్రవారం) ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2
  • 16-03-2027 (మంగళవారం) కెమిస్ట్రీ-2, కామర్స్ & అకౌంటెన్సీ పేపర్-2
  • 18-03-2027 (గురువారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2
  • 20-03-2027 (శనివారం) మోడర్న్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్-2

ఇంటర్ పరీక్షల తేదీలు

  • ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష తేదీ: జనవరి 27
  • ఇంగ్లిష్ ప్రాక్టికల్ (ఫస్టియర్) పరీక్ష తేదీ: జనవరి 29
  • ఇంగ్లిష్ ప్రాక్టికల్ (సెకండియర్) పరీక్ష తేదీ: జనవరి 30
  • ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 1-10
  • ప్రథమ సంవత్సరం సైన్స్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 11-18
  • ఫస్టియర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి
  • సెకండియర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి

ఒకేషనల్ విద్యార్థులకు కూడా ఇదే షెడ్యూల్

ఈ తాత్కాలిక టైమ్‌టేబుల్‌లో పేర్కొన్న థియరీ పరీక్షల తేదీలు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా వర్తిస్తాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రత్యేక పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడిగా విడుదల చేయనుంది. ప్రస్తుతం విడుదల చేసినది తాత్కాలిక పరీక్షల షెడ్యూల్ మాత్రమే. కాబట్టి విద్యార్థులు తాజా మార్పులు, తుది పరీక్షల టైమ్‌టేబుల్ కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పరీక్షలకు ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించి, సబ్జెక్టుల వారీగా చదువుకునే ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు 2027 పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో పరీక్షల సన్నద్ధతకు సమయం ఆసన్నమైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us