TG ICET 2026: తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

రాష్ట్రంలోని మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులలైన MBA, MCA ప్రవేశాల కోసం నిర్వహించే TG ICET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఈ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని..

TG ICET 2026: తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
Telangana ICET 2026 notification

Edited By:

Updated on: Feb 06, 2026 | 6:17 PM

హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్రంలోని మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులలైన MBA, MCA ప్రవేశాల కోసం నిర్వహించే TG ICET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఈ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి వెల్లడించారు. ఐసెట్ పూర్తి షెడ్యూల్‌ ఈ కింద చెక్‌ చేసుకోండి..

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • తెలంగాణ ఐసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 6, 2026
  • ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 12, 2026 (గురువారం)
  • దరఖాస్తుకు చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా): మార్చి 16, 2026 (సోమవారం)
  • ఐసెట్ పరీక్ష తేదీ: మే 13, 14 తేదీల్లో
  • పరీక్షా సమయాలు (షెడ్యూల్): పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు
    ఉదయం సెషన్: 10:00 AM నుండి 12:30 PM వరకు
    మధ్యాహ్నం సెషన్: 2:30 PM నుండి 5:00 PM వరకు

రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు..

అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి నిర్ణీత రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. SC/ST, దివ్యాంగులు రూ. 550, ఇతర అభ్యర్థులందరూ రూ. 750 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ సందర్శించి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ఐసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us