SBI Bank Jobs 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష జీతం

హైదరాబాద్‌, ముంబయి ఎస్బీఐ బ్రాంచుల్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (IS) ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్ విభాగాల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 116 పోస్టులను భర్తీ చేయనుంది..

SBI Bank Jobs 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష జీతం
State Bank Of India Jobs

Updated on: Mar 04, 2026 | 5:48 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. హైదరాబాద్‌, ముంబయి బ్రాంచుల్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (IS) ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్ విభాగాల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 116 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (ఐఎస్‌ ఆడిట్) పోస్టులు 12, డిప్యూటీ మేనేజర్ (ఐఎస్‌ ఆడిట్) పోస్టులు 43, డిప్యూటీ మేనేజర్ (సీఏ- ఇంటర్నల్ ఆడిట్) పోస్టులు 61 వరకు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో సీఎస్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో బీఈ/బీటెక్‌ లేదా సీఏ (చార్టెడ్‌ అకౌంట్‌)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి. సీఐఎస్‌ఏ, సీఐఎస్‌ఎస్‌పీ, డీఐఎస్‌ఏ సర్టిఫికేట్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయసు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌ పోస్టులకు 27 నుంచి 35 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ (ఐఎస్‌ ఆడిట్‌) పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ (సీఏ) పోస్టులకు 21 నుంచి 35 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 15, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్ధులు రూ.750 చొప్పున చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా తుది చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపికైన వారు హైదరాబాద్‌, ముంబయి బ్రాంచుల్లో విధులు నిర్వహించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us