డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పోలీస్‌ శాఖలో 1871 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌!

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) దిల్లీ పోలీసు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (CAPF)లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1871 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 30, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పోలీస్‌ శాఖలో 1871 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌!
SSC CPO Sub-Inspector Recruitment

Updated on: Sep 11, 2026 | 11:20 AM

ఢిల్లీ పోలీసు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (CAPF)లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్ష-2026కు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఢిల్లీ పోలీసుతో పాటు BSF, CISF, CRPF, ITBP, SSB వంటి కేంద్ర సాయుధ బలగాల్లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద CAPF పరిధిలోని మొత్తం 1871 BSF, CISF, CRPF, ITBP, SSB విభాగాల్లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 30, 2026 చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • CAPFల్లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (GD) పోస్టుల సంఖ్య: 1,320
  • ఢిల్లీ పోలీసులో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (ఎగ్జిక్యూటివ్‌) పురుషులు పోస్టుల సంఖ్య: 205
  • ఢిల్లీ పోలీసులో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (ఎగ్జిక్యూటివ్‌) మహిళలు పోస్టుల సంఖ్య: 112
  • CAPFలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (ఫైర్‌) పురుషులు పోస్టుల సంఖ్య: 234

సాధారణ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. CAPFలోని సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (ఫైర్‌) పోస్టులకు సైన్స్‌ విభాగంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో డిగ్రీ ఉండాలి. లేదా సంబంధిత ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. ఢిల్లీ పోలీసు సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (పురుషులు) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిజికల్‌ టెస్ట్‌ సమయానికి LMV (మోటార్‌ సైకిల్‌, కార్‌) డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి సాధారణ CAPF/ఢిల్లీ పోలీసు సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు అభ్యర్థుల వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. CAPF సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (ఫైర్‌) పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులను పలు దశల్లో ఎంపిక చేస్తారు. ముందుగా కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్ష (PET), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST) నిర్వహిస్తారు. ఎంపికైన సబ్‌-ఇన్‌స్పెక్టర్లకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా అందుతాయి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 10, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 30, 2026.
  • దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: అక్టోబర్‌ 1, 2026.
  • దరఖాస్తు సవరణకు అవకాశం: 8 అక్టోబర్‌ నుంచి 10 అక్టోబర్‌ 2026 వరకు
Loading...
Unable to load recommendations.
Follow Us