SBI Jobs 2025: రాత పరీక్షలేకుండానే స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1146 ఉద్యోగాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ (SCO) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1146 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్ పోస్టులను..

SBI Jobs 2025: రాత పరీక్షలేకుండానే స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1146 ఉద్యోగాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే
SBI Specialist Cadre Officer Jobs

Updated on: Jan 05, 2026 | 4:01 PM

దేశ వ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ (SCO) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1146 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో వీపీ వెల్త్‌(ఎస్‌ఆర్‌ఎం) పోస్టులు 582, ఏవీపీ వెల్త్‌ (ఆర్‌ఎం) పోస్టులు 237, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 327 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ తేదీలోజనవరి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

సంబంధిత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 2025 మే 1వ తేదీ నాటికి 20 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీకి ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా జనవరి 10, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us