ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్‌ షురూ.. సెప్టెంబర్‌ 16 వరకే ఛాన్స్

ప్రభుత్వ, ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, నాన్‌మైనారిటీ ఆయుష్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా కింద వివిధ ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 8న విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా బీఏఎంఎస్‌..

ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్‌ షురూ.. సెప్టెంబర్‌ 16 వరకే ఛాన్స్
NEET UG 2026 Counselling Notification

Updated on: Sep 10, 2026 | 7:54 AM

అమరావతి, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, నాన్‌మైనారిటీ ఆయుష్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా కింద వివిధ ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 8న విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా బీఏఎంఎస్‌ (ఆయుర్వేద), బీహెచ్‌ఎంఎస్‌ (హోమియోపతి), బీయూఎంఎస్‌ (యునాని) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. NEET UG-2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 16వ తేదీ రాత్రి 9 గంటల్లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులకు అవకాశం ఉండదని అధికారులు సూచించారు.

NEET కటాఫ్‌ మార్కులు ఇలా..

జనరల్‌ (OC/EWS) కేటగిరీ అభ్యర్థులకు NEETలో 715 నుంచి 213 మార్కులు, అంటే 50వ పర్సంటైల్‌ అర్హతగా నిర్ణయించారు.
జనరల్‌ (OC/EWS-PwD) దివ్యాంగ అభ్యర్థులకు 212 నుంచి 177 మార్కులు, అంటే 45వ పర్సంటైల్‌ అర్హత ఉండాలి.
అదేవిధంగా 40వ పర్సంటైల్‌ అర్హత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 212 నుంచి 117 మార్కులు ఉండాలి. బీసీ/ఎస్సీ దివ్యాంగ అభ్యర్థులకు 193 నుంచి 177 మార్కులు, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 191 నుంచి 178 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు.

ఏ కోర్సుల్లో ప్రవేశాలు?

కన్వీనర్‌ కోటా కింద ఆయుష్‌ కళాశాలల్లో ఈ మూడు కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు..

ఇవి కూడా చదవండి
  • BAMS – బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ
  • BHMS – బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ
  • BUMS – బ్యాచిలర్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌ అండ్‌ సర్జరీ

NEET UG-2026లో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సూచించింది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలు, నిబంధనలు, కౌన్సెలింగ్‌ వివరాలను పూర్తిగా పరిశీలించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us