IIT లేదు.. క్యాంపస్ ప్లేస్‌మెంటూ లేదు.. అయినా రూ.38 లక్షల ప్యాకేజీతో జాబ్‌ అఫర్‌ కొట్టిన యువతి!

ఓ యువతి పట్టుదల, నిరంతర కృషితో అరుదైన విజయాన్ని సాధించింది. ఐఐటీ లేదా ప్రముఖ కాలేజీ నేపథ్యం లేకపోయినా.. ఇంటర్న్‌షిప్‌లు చేస్తూ నైపుణ్యాలను పెంచుకుని ఏకంగా రూ.38 లక్షల వార్షిక ప్యాకేజీ ఉద్యోగాన్ని పొందింది. హైదరాబాద్, బెంగళూరులో చేసిన ఇంటర్న్‌షిప్‌లు ఆమె కెరీర్‌కు మలుపు తిప్పాయి. ఈ సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

IIT లేదు.. క్యాంపస్ ప్లేస్‌మెంటూ లేదు.. అయినా రూ.38 లక్షల ప్యాకేజీతో జాబ్‌ అఫర్‌ కొట్టిన యువతి!
Tier 3 Graduate Success Story Goes Viral

Updated on: Aug 06, 2026 | 5:17 PM

పట్టుదల, నిరంతర కృషి ఉంటే పెద్ద కాలేజీ, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచే విజయం సాధించాలనే నియమం లేదని ఓ యువతి నిరూపించింది. టైర్‌ 3 నగరానికి చెందిన ఓ యువతి క్యాంపస్ ప్లేస్‌మెంట్ సాయం లేకుండానే ఫ్రెషర్‌గా ఏకంగా రూ.38 లక్షల వార్షిక (LPA) ఉద్యోగాన్ని దక్కించుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని ఎక్స్ (X) వేదికగా Anandani Nisha అనే యూజర్ పంచుకున్నారు. ఆమె ఐఐటీ చదవలేదు. ఏ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలోనూ చదవలేదు. అయినప్పటికీ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగింది.

హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఇంటర్న్‌షిప్ జర్నీ

ముందుగా హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్ చేసిన ఆ యువతి, అనంతరం బెంగళూరులో మరో ఇంటర్న్‌షిప్‌లో చేరింది. అక్కడ తన ప్రతిభ, కృషితో సంస్థను ఆకట్టుకుని చివరికి ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ (PPO) పొందింది. అదే ఆమెకు ఏడాదికి రూ.38 లక్షల వేతనంతో ఉద్యోగాన్ని అందించింది. ఆమె ఎప్పుడూ నేర్చుకోవడాన్ని ఆపలేదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. నిరంతరం కష్టపడింది. చివరికి ఆ ఇంటర్న్‌షిప్‌నే ఆమెకు ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌గా మార్చింది. అయితే ఈ విజయానికి తమ కళాశాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆ యువతి ఫొటోను కాలేజీ ప్రచారానికి ఉపయోగించిందని ఆ పోస్ట్‌లో ఆరోపించారు. ఉద్యోగం రావడంలో కళాశాల ఎలాంటి పాత్ర పోషించకపోయినా, తన విజయాన్ని ప్రచారం కోసం వినియోగించుకుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇంతటి భారీ ప్యాకేజీ సాధించి, సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆ యువతి ఇప్పటికీ ఎంతో వినయంగా ఉంటోందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. వాతావరణం బాగుందని నేను క్రెడిట్ తీసుకున్నట్లే, ఆమె విజయానికి కాలేజీ క్రెడిట్ తీసుకుంటోందని ఓ యూజర్‌ వ్యాఖ్యానించారు. మరో నెటిజన్ ‘నా స్నేహితుడికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. ప్రముఖ ఎంఎన్‌సీలో ఉద్యోగం వచ్చిన తర్వాత, మా కాలేజీ హెచ్‌వోడీ అతని ఫొటోను ప్రచారం కోసం ఉపయోగించవచ్చా అని అడిగారు’ అని తెలిపారు. మరో నెటిజన్‌ ‘పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వం, బలమైన లక్ష్యం, ఎప్పటికీ లొంగిపోని మనస్తత్వం ఒకరోజు తప్పకుండా విజయాన్ని అందిస్తాయి. ఆమె సాధించిన విజయానికి అభినందనలు’ అంటూ ప్రసంశలతో ముంచెత్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us