
నిరుద్యోగ యువతకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఇస్ట్రోలో Assistant, Upper Division Clerk (UDC), Junior Personal Assistant (JPA), Stenographer పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 242 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 16, 2026 వరకు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, ముఖ్యంగా దేశంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థలో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
అసిస్టెంట్/ UDC పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు డిగ్రీలో కనీసం 60% మార్కులు లేదా CGPA 6.32/10 ఉండాలి. నిర్ణీత వ్యవధిలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ / Stenographer పోస్టులకు డిగ్రీ లేదా Commercial/Secretarial Practiceలో డిప్లొమా (కనీసం 60% మార్కులతో) ఉత్తీర్ణత ఉండాలి. స్టెనో టైపిస్ట్/స్టెనోగ్రాఫర్‌గా కనీసం ఒక సంవత్సరం అనుభవం అవసరం. ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 60 పదాల వేగం ఉండాలి. ఈ పోస్టులకు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఇక అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 16, 2026 నాటికి జనరల్ అభ్యర్ధులకు గరిష్ఠంగా 28 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్ధులకు 31 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు 33 సంవత్సరాల వరకు వయసు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాకలు వయో సడలింపు వర్తిస్తుంది.
ఇస్రో ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు కింద General / OBC / EWS అభ్యర్ధులకు రూ.500 (రాత పరీక్షకు హాజరైతే రూ.400 తిరిగి చెల్లిస్తారు.), SC / ST / మహిళా అభ్యర్థులకు రూ.500 (రాత పరీక్షకు హాజరైతే మొత్తం రూ.500 తిరిగి చెల్లిస్తారు.) చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇస్రో ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.