ISROలో భారీగా సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. సెప్టెంబరు 16 వరకే దరఖాస్తుకు ఛాన్స్‌!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో సైంటిస్ట్‌/ఇంజినీర్ 'ఎస్సీ' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. సంబంధిత ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా సెప్టెంబరు 16, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

ISROలో భారీగా సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. సెప్టెంబరు 16 వరకే దరఖాస్తుకు ఛాన్స్‌!
ISRO Scientist Engineer Recruitment

Updated on: Aug 28, 2026 | 2:57 PM

భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కోరుతూ మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇస్రోకి చెందిన సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ICRB) ద్వారా సైంటిస్ట్‌/ ఇంజినీర్ ‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 175 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 16, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు..

విభాగాల వారీగా పోస్టుల వివరాలు

  • సైంటిస్ట్‌/ఇంజినీర్ ‘ఎస్సీ’ (ఎలక్ట్రానిక్స్)లో పోస్టుల సంఖ్య: 100
  • సైంటిస్ట్‌/ఇంజినీర్ ‘ఎస్సీ’ (మెకానికల్)లో పోస్టుల సంఖ్య: 53
  • సైంటిస్ట్‌/ఇంజినీర్ ‘ఎస్సీ’ (కంప్యూటర్ సైన్స్)లో పోస్టుల సంఖ్య: 22

ISROలో సైంటిస్ట్‌/ఇంజినీర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై సాధించి ఉండాలి. సంబంధిత బ్రాంచ్‌కు సంబంధించిన పూర్తి అర్హతలను నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అభ్యర్ధుల వయోపరిమితి దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబరు 16, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులందరూ రూ.750 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితర దశల ఆధారంగా ఉంటుంది. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 ప్రాథమిక వేతనంగా లభిస్తుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందుతాయి. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ISROలో సైంటిస్ట్‌/ఇంజినీర్‌గా కెరీర్‌ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఈ నియామకం మంచి అవకాశం. దరఖాస్తు చేయడానికి ముందు పోస్టుల వారీగా విద్యార్హత, వయోపరిమితి, బ్రాంచ్‌ అర్హతలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

ISROలో సైంటిస్ట్‌/ఇంజినీర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us