నెలకు రూ.1.05 లక్షల జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌, జనరలిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 29, 2026 నుంచి ఆన్‌లైన్‌లో..

నెలకు రూ.1.05 లక్షల జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
Indian Overseas Bank Recruitment

Updated on: Aug 29, 2026 | 4:08 PM

ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) మరో భారీ నోటిఫికేషన్‌ అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌, జనరలిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 29, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IOB విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం వివిధ విభాగాల్లో ఖాళీలు..

  • మేనేజర్ – బ్రాంచ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల సంఖ్య: 100
  • మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌ – ఐటీ పోస్టుల సంఖ్య: 75
  • మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌ – ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ పోస్టుల సంఖ్య: 8
  • మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌ – IS ఆడిట్‌ పోస్టుల సంఖ్య: 7
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ – సెక్యూరిటీ పోస్టుల సంఖ్య: 25
  • సీనియర్‌ మేనేజర్‌ – డేటాబేస్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల సంఖ్య: 15
  • సీనియర్‌ మేనేజర్‌ – సైబర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల సంఖ్య: 5
  • మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌ – క్రెడిట్‌ పోస్టుల సంఖ్య: 50
  • సీనియర్‌ మేనేజర్‌ – రిస్క్‌ పోస్టుల సంఖ్య: 6

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టులను బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ (ఫైనాన్స్‌) తత్సమాన కోర్సులో విద్యార్హతలు కలిగి ఉండాలి. సంబంధిత పోస్టులకు నిర్దేశించిన విధంగా ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ప్రతి పోస్టుకు సంబంధించిన ప్రత్యేక విద్యార్హతలు, అనుభవాన్ని అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అభ్యర్ధుల వయోపరిమితి పోస్టును బట్టి 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 15, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌/ OBC/ EWS అభ్యర్ధులు రూ.1000, SC/ ST/ PwBD/ ESM/ మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్క్రీనింగ్‌, ఆన్‌లైన్‌ CBT పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. ఆన్‌లైన్‌ పరీక్షలో సాధించిన మార్కులకు 80 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి తుది మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలను జాగ్రత్తగా గుర్తించాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.48,480 నుంచి రూ.1,05,280 వరకు బేసిక్‌ పే లభిస్తుంది. దీనికి అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు ఉంటాయి.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us