IIT Kharagpur Jobs 2022: నెట్/గేట్ అర్హతతో.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉద్యోగావకాశాలు.. దరఖాస్తు ఇలా..

|

May 17, 2022 | 6:28 PM

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల (JRF Posts) భర్తీకి..

IIT Kharagpur Jobs 2022: నెట్/గేట్ అర్హతతో.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉద్యోగావకాశాలు.. దరఖాస్తు ఇలా..
Iit Kharagpur
Follow us on

IIT Kharagpur Junior Research Fellow Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల (JRF Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 31,000ల నుంచి రూ.34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/బీఈ, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. నెట్/గేట్ అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.