Telangana Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ.

|

Aug 16, 2021 | 2:36 PM

Telangana Anganwadi Teacher Jobs: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకు చెందిన..

Telangana Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ.
Anganwadi Teachers
Follow us on

Telangana Anganwadi Teacher Jobs: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకు చెందిన మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. ఐసీడీఎస్‌ పరిధిలో 109 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో (ఆగస్టు 16) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 109 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అంగన్‌వాడీ టీచర్ – 23, మినీ అంగన్‌ వాడీ టీచర్ – 7, సహాయకులు – 79 ఖాళీలున్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు విషయంలో సడలింపులు వర్తిస్తాయి)
* అభ్యర్థులను అకడమిక్ మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* నల్గొండాలోని అనుమల, చింతపల్లి, దామర చర్ల, దేవర కొండ, కొండ మల్లేపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఈ నియమకాలు చేపట్టనున్నారు.
* స్థానికంగా ఉన్న మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటితో (ఆగస్టు 16) ముగియనుంది.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 20 నుంచి 30వ తేదీ వరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో జరగనున్న వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: పరిస్థితి ఉద్రిక్తం.. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు.. అయిదుగురి మృతి ..?

ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేత

Ramya Murder Case: ఎవరి బిడ్డైనా ఒకటే.. నా కొడుకుకి తగిన శాస్తి జరగాల్సిందే.. నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు