EXIM Bank Recruitment 2022: ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో ఆఫీసర్‌ గ్రేడ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

|

Jul 24, 2022 | 8:23 AM

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్‌పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Export-Import Bank of India).. బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్, బిజినెస్ డెవలప్‌మెంట్, క్రెడిట్ హెడ్, క్రెడిట్ అడ్మినిస్ట్రేషన్ తదితర పోస్టుల (Relation Manager Posts) భర్తీకి..

EXIM Bank Recruitment 2022: ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో ఆఫీసర్‌ గ్రేడ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
Exim Bank
Follow us on

EXIM Bank Officer Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్‌పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Export-Import Bank of India).. బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్, బిజినెస్ డెవలప్‌మెంట్, క్రెడిట్ హెడ్, క్రెడిట్ అడ్మినిస్ట్రేషన్ తదితర పోస్టుల (Relation Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 19

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఓసీ –బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్, ఓసీ – బిజినెస్ డెవలప్‌మెంట్, ఓసీ – క్రెడిట్ హెడ్, ఓసీ – క్రెడిట్, ఓసీ – క్రెడిట్ అడ్మినిస్ట్రేషన్, ఓసీ – ఆపరేషన్స్ హెడ్, ఓసీ – ఆపరేషన్స్, ఓసీ – క్రెడిట్ కంట్రోల్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 55 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ లేదా ఫైనాన్స్/మార్కెటింగ్/అకౌంటింగ్‌లో పీజీడీబీఏ, చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.600
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.