AP Govt Jobs: తూర్పు గోదావరి డీఎంహెచ్‌ఓలో ఫార్మసిస్టు పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

| Edited By: Ravi Kiran

Dec 14, 2021 | 11:27 AM

AP Govt Jobs: తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీఎస్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో...

AP Govt Jobs: తూర్పు గోదావరి డీఎంహెచ్‌ఓలో ఫార్మసిస్టు పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Follow us on

AP Govt Jobs: తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌/ యూపీహెచ్‌సీఎస్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి? అర్హులు ఎవరు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా (ఫార్మసీ) కోర్సు/ బ్యాచిలర్‌ ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-11-2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను డీఎంహెచ్‌ఓ, తూర్పు గోదావరి, ఏపీ అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థులు రూ. 300 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 21-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Gurthunda Seethakalam: గుర్తుందా శీతాకాలం నుంచి లేటేస్ట్ అప్డేట్.. తమన్నా సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..

EPFO Nominee: మీ పీఎఫ్‌ ఖాతాకు నామినీ పేరు చేర్చారా..? గడువు దగ్గర పడుతోంది..!

KK – Etela Rajender: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. వైరల్‌గా మారిన ఈటల, కేకే పలకరింపు..