
హైదరాబాద్, ఆగస్ట్ 2: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కన్సార్టియమ్ (Consortium) కీలక అప్‌డేట్ జారీ చేసింది. CLAT 2027 సిలబస్, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (Consortium of National Law Universities) స్పష్టం చేసింది. నెట్టింట క్లాట్ సిలబస్ మారిందని జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. ఈ అప్‌డేట్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల CLAT పరీక్షలో మార్పులు ఉండొచ్చనే ప్రచారం నేపథ్యంలో అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అభ్యర్థులు ఇప్పటి వరకు అనుసరిస్తున్న సిలబస్ ప్రకారమే తమ సన్నద్ధతను కొనసాగించవచ్చని కన్సార్టియం తెలిపింది.
CLAT 2027లో కూడా గత సంవత్సరాల మాదిరిగానే ఈ క్రింది అంశాల నుంచి ప్రశ్నలు అడగనున్నారు. అభ్యర్థులు ఈ కింది అధికారిక సిలబస్ ఆధారంగా ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు.
పరీక్షా విధానం కూడా యథాతథంగా కొనసాగనుందని కన్సార్టియమ్ స్పష్టం చేసింది. ప్రశ్నల రూపం, విభాగాలు, మార్కింగ్ విధానం వంటి అంశాల్లో ఎలాంటి కొత్త మార్పులు లేవని స్పష్టం చేశారు. ఆ క్రమంలో విద్యార్ధులకు పలు కీలక సూచనలు చేసింది..
కాబట్టి CLAT 2027కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ ప్రకటనతో అనిశ్చితి తొలగింది. పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పులు లేనందున, ఇప్పటికే రూపొందించుకున్న అధ్యయన ప్రణాళికను కొనసాగించవచ్చు.