పదో తరగతి అర్హతతో RRC సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు

సెంట్రల్ రైల్వేలో 2,861 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లించనున్నారు. ముంబయి, భుసావల్, పుణె, నాగ్‌పుర్, షోలాపూర్ క్లస్టర్లలో ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 2, 2026 చివరి తేదీ. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పూర్తి వివరాలు తెలుసుకోండి..

పదో తరగతి అర్హతతో RRC సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు
Central Railway Apprentice Recruitment

Updated on: Nov 20, 2026 | 7:27 AM

సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), ముంబయి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు డిసెంబర్ 2, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తంగా 2,861 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆయా క్లస్టర్ల పరిధిలోని వర్క్‌షాప్‌లు, డిపోలు, ఇతర విభాగాల్లో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు అవకాశం కల్పించారు. ఫిట్టర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ (COPA), మెకానిక్, పెయింటర్‌ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలోని ఐదు క్లస్టర్లలో ఈ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • ముంబయి క్లస్టర్: 1,712 పోస్టులు
  • భుసావల్ క్లస్టర్: 500 పోస్టులు
  • పుణె క్లస్టర్: 271 పోస్టులు
  • నాగ్‌పుర్ క్లస్టర్: 221 పోస్టులు
  • షోలాపూర్ క్లస్టర్: 157 పోస్టులు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడులో ఐటీఐ (ITI) పూర్తి చేసి ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా హోల్డర్లు ఈ పోస్టులకు అర్హులు కారు. అలాగే 2026 నవంబర్ 3 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 15 సంవత్సరాలు, గరిష్ఠంగా 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు: రూ.100 చొప్పున చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపికను మెరిట్ ఆధారంగా చేపడతారు. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపట్టి, అర్హులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ శిక్షణ సమయంలో నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ కాలం ఒక సంవత్సరం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us