AP Inter Results 2026: మరికాసేపట్లోనే ఏపీ ఇంటర్‌ ఫలితాలు 2026 విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

AP Inter Result 2026 Today: రాష్ట్రంలో ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరీక్షణకు తెరపడనుంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలోనే ఫలితాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ఇంటర్ విద్యా మండలి నిర్ణయం కూడా నెరవేరే సమయం ఆసన్నమైంది..

AP Inter Results 2026: మరికాసేపట్లోనే ఏపీ ఇంటర్‌ ఫలితాలు 2026 విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
Andhra Pradesh Inter Result Date And Time

Updated on: Apr 15, 2026 | 1:11 PM

అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2026 ఈ రోజు (బుధవారం) విడుదల కానున్నాయి. బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు ఇంటర్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియా వేదికగా ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరీక్షణకు తెరపడనుంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలోనే ఫలితాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ఇంటర్ విద్యా మండలి నిర్ణయం కూడా నెరవేరే సమయం ఆసన్నమైంది. ఫలితాల విడుదల తర్వాత రిజల్ట్స్ ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ ఒక్క క్లిక్‌తో మార్కుల లిస్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను 2026 టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో ఒక్క క్లిక్ తో చెక్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు కలిపి మొత్తం 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 21 నుంచి మొదలవగా ఏప్రిల్‌ 14తో పూర్తయ్యింది. తొలుత ఏప్రిల్‌ 21లోగా ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనానికి హుటాహుటీనా పూర్తి చేశారు. ఇక మార్కుల ప్రాసెస్‌ ప్రక్రియను కూడా త్వరిత గతిన పూర్తిచేసిన విద్యాశాఖ ముందుగా నిర్ణయించిన సమయం కంటే ఇంకాస్త ముందుగానే ఫలితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. నిజానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణల వల్ల పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టింది. ఈ కారణంగానే మూల్యాంకనంలో కాస్త జాప్యం నెలకొంది.

ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఇంటర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరోవైపు జూన్ 1 నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మే 31 నాటికే సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేయాలని ఇంటర్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. అటు తెలంగాణలో ఏప్రిల్‌ 12వ తేదీనే ఇంటర్ ఫలితాలను ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షలను మే 13 నుంచి నిర్వహించి మే నెలాఖరు నాటికి ఫలితాలను వెల్లడించాలని భావిస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us