Hero Splendor: బంపర్ ఆఫర్.. రూ. 28 వేలకే హీరో స్ప్లెండర్ బైక్ మీ సొంతం.. కొద్ది రోజులు మాత్రమే!

అద్భుతమైన పనితీరు, అధిక మైలేజీ అందించే ఈ బైక్‌లు ప్రతి నెలా 1 లక్షకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఇండియాలో హీరో స్ప్లెండర్ ఎంత పాపులర్ అయిందో ఈ లెక్కల బట్టి మనకు అర్ధమవుతుంది.

Hero Splendor: బంపర్ ఆఫర్.. రూ. 28 వేలకే హీరో స్ప్లెండర్ బైక్ మీ సొంతం.. కొద్ది రోజులు మాత్రమే!
Hero Splendor

Updated on: Apr 19, 2023 | 8:00 PM

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌ల ఒకటి హీరో స్ప్లెండర్. అద్భుతమైన పనితీరు, అధిక మైలేజీ అందించే ఈ బైక్‌లు ప్రతి నెలా 1 లక్షకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఇండియాలో హీరో స్ప్లెండర్ ఎంత పాపులర్ అయిందో ఈ లెక్కల బట్టి మనకు అర్ధమవుతుంది. ఒకవేళ మీరు కూడా ఈ బైక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, బడ్జెట్ గురించి టెన్షన్ పడకండి. మీరు ఈ బైక్‌ను కేవలం రూ.28 వేలకే కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.72,420 నుంచి ప్రారంభమవుతోంది. దానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాదని మీరు సెకండ్ హ్యాండ్ బైక్‌ను ఆప్షన్‌గా ఎంచుకుంటే.. సెకండ్ హ్యాండ్ బైకులు విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో హీరో స్ప్లెండర్‌పై అనువైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 30వేలలోపు ఈ బైక్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.

2019 మోడల్ Hero Splendorని Quikrలో కేవలం రూ.28 వేలకే కొనుగోలు చేయవచ్చు. ఇది కేవలం 17,000 కి.మీ మాత్రమే ప్రయాణించింది. ఈ బైక్ ఢిల్లీ సర్కిల్‌లో లభిస్తుంది. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.

 

Loading...
Unable to load recommendations.
Follow Us