
4K Smart Projector: భారతదేశంలో ఒక కొత్త, సరసమైన ప్రొజెక్టర్ విడుదల చేసింది. ఇది మీ ఇంట్లోని ఏ గోడపైనైనా 300-అంగుళాల 4K స్మార్ట్ టీవీని ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. XElectron CineLux 4K రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ ప్రొజెక్టర్ అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, అనేక కనెక్టివిటీ పోర్ట్‌లు, మరెన్నో సౌకర్యాలను అందిస్తుంది.
XElectron CineLux 4Kలో 4K అల్ట్రా HD (2160p) రిజల్యూషన్, 4,000 ANSI ల్యూమెన్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. మరియు ఇది HDR సపోర్ట్, ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. XElectron CineLux 4K 300 అంగుళాల వరకు స్క్రీన్ సైజును సాధించగలదని కంపెనీ పేర్కొంది. ఇది ఆండ్రాయిడ్ 16 పై పనిచేస్తూ, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ లాంటి అనుభవాన్ని అందిస్తుంది.
XElectron CineLux 4K ప్రొజెక్టర్ A55 క్వాడ్-కోర్ 64-బిట్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. దీనికి 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇందులో ఆటోఫోకస్, ఆటో-టిల్ట్ కరెక్షన్, ఆటో-స్క్రీన్ ఫిట్ వంటి ఆటోమేటిక్ సర్దుబాట్లు ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్‌లో డస్ట్-ప్రూఫ్ ఆప్టికల్ ఇంజిన్ మరియు 50 గంటల ల్యాంప్ లైఫ్ కూడా ఉన్నాయి. ఆడియో విషయానికి వస్తే, XElectron CineLux 4Kలో డాల్బీ ఆడియో, DTS డీకోడింగ్‌తో కూడిన 10K ఫుల్-ఫ్రీక్వెన్సీ స్పీకర్లు ఉన్నాయి. ఈ స్పీకర్లు కలిసి 20W వరకు అవుట్‌పుట్‌ను అందిస్తాయి.
XElectron CineLux 4K ధర భారతదేశంలో రూ.449,990 ధరకు విడుదల చేసింది. ఇది అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, XElectron అధికారిక పోర్టల్‌లో జాబితా చేయబడింది. 4K కనెక్టివిటీ: కనెక్టివిటీ పరంగా XElectron CineLux 4K వై-ఫై 6, బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో రెండు HDMI పోర్ట్‌లు, USB, LAN, 3.5mm ఆడియో పోర్ట్‌లు, ఒక HDMI ARC పోర్ట్ ఉన్నాయి. ఇది AirPlay, MirrorCast స్ట్రీమింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: UPI: ఫోన్‌పే, గూగుల్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. యూపీఐ ఛార్జీలపై కీలక నిర్ణయం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి