Helicopter Ride: మీరు మొదటిసారి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే డేంజర్‌..!

Helicopter Ride: హెలికాప్టర్ స్థిరత్వం ప్రయాణికుల బరువుపై ఆధారపడి ఉంటుంది. అందుకే టికెట్ బుకింగ్ లేదా బోర్డింగ్ సమయంలో మీ బరువును నమోదు చేస్తారు. హెలికాప్టర్ గాల్లో ఉన్నప్పుడు పైలట్ అనుమతి లేకుండా హఠాత్తుగా కదలడం లేదా సీట్లు మారడం చేయకూడదు. ఈ చిన్నపాటి సురక్షిత..

Helicopter Ride: మీరు మొదటిసారి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే డేంజర్‌..!
Helicopter Ride

Updated on: Aug 28, 2026 | 1:19 PM

First Helicopter Ride: సాధారణంగా సుదీర్ఘ ప్రయాణాలకు విమానం, రైలు లేదా బస్సులను వాడుతుంటాం. కానీ పర్యాటక ప్రాంత సందర్శనలు, కొండ ప్రాంతాలకు వెళ్లే ఆధ్యాత్మిక యాత్రలు లేదా అత్యవసర సందర్భాల్లో హెలికాప్టర్ ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. మొదటిసారి హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఆనందం, ఉత్సాహంతో పాటు కొంత భయం ఉండటం సహజం. అయితే విమానంతో పోలిస్తే హెలికాప్టర్ పనితీరు, ల్యాండింగ్, టేకాఫ్ విధానాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. అందువల్ల ప్రమాదాలకు తావులేకుండా సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: New Rules: సెప్టెంబర్ 1 నుండి మారనున్న నిబంధనలు.. ఎల్‌పిజి సిలిండర్ ధ‌ర‌ల‌తో పాటు ఆధార్‌లో కీల‌క మార్పులు!

మొదటిసారి హెలికాప్టర్ రైడ్ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన భద్రతా నియమాలు ఇవే:

1. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో తొందరపాటు వద్దు

హెలికాప్టర్ వైపు వెళ్లేటప్పుడు లేదా ఎక్కి దిగేటప్పుడు ఎప్పుడూ పరిగెత్తకూడదు. హెలికాప్టర్ రోటర్ బ్లేడ్లు (రెక్కలు) అత్యంత వేగంతో తిరుగుతుంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ తల వంచి సిబ్బంది చూపించిన మార్గంలోనే నడవాలి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో లేదా హెలిప్యాడ్‌పై గాలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

2. వదులుగా ఉన్న వస్తువులతో జాగ్రత్త

హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చే వేగవంతమైన గాలి కారణంగా మీ చేతిలోని టోపీలు, స్కార్ఫ్‌లు, చష్మా లేదా వదులుగా ఉన్న పేపర్లు ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఇవి ఎగిరి రోటర్ బ్లేడ్లలో చిక్కుకుంటే పెద్ద ప్రమాదం జరగొచ్చు. అందుకే ప్రయాణ సమయంలో టోపీలు, స్కార్ఫ్‌లను తీసివేయడం లేదా బ్యాగ్‌లో భద్రపరచుకోవడం శ్రేయస్కరం.

3. భద్రతా సూచనలు శ్రద్ధగా వినండి

హెలికాప్టర్ ఎక్కడానికి ముందు సిబ్బంది ఇచ్చే సేఫ్టీ డెమోను జాగ్రత్తగా గమనించాలి. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి. అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉన్నాయి, హెడ్‌సెట్ ఎలా ఉపయోగించాలి అనే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి.

4. హెడ్‌సెట్ తప్పనిసరిగా ధరించండి

హెలికాప్టర్ ఇంజిన్, రెక్కల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రయాణికులకు ఇచ్చే నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌సెట్‌లను ధరించాలి. ఇది శబ్దం నుండి చెవులను రక్షించడమే కాకుండా, పైలట్ ఇచ్చే సూచనలను స్పష్టంగా వినడానికి సహాయపడుతుంది.

5. పైలట్ అనుమతి లేకుండా సీటు మారవద్దు

హెలికాప్టర్ స్థిరత్వం ప్రయాణికుల బరువుపై ఆధారపడి ఉంటుంది. అందుకే టికెట్ బుకింగ్ లేదా బోర్డింగ్ సమయంలో మీ బరువును నమోదు చేస్తారు. హెలికాప్టర్ గాల్లో ఉన్నప్పుడు పైలట్ అనుమతి లేకుండా హఠాత్తుగా కదలడం లేదా సీట్లు మారడం చేయకూడదు. ఈ చిన్నపాటి సురక్షిత నియమాలను పాటిస్తే మీ మొదటి హెలికాప్టర్ ప్రయాణం ఎంతో ఆనందకరంగా, చిరస్మరణీయంగా మారుతుంది.

ఇది కూడా చదవండి: Train Food Taste: రైలులో ఇచ్చే ఆహారం ఇంటి భోజనంలా ఎందుకు రుచిగా ఉండదు.. అసలు కారణం ఇదే!

ఇది కూడా చదవండి: Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us