Today Gold Price : మహిళలకు గుడ్‌న్యూస్..! మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?

| Edited By: Phani CH

May 29, 2021 | 10:14 AM

Gold Rate Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట

Today Gold Price : మహిళలకు గుడ్‌న్యూస్..! మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?
Follow us on

Gold Rate Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మే నెల నుంచి పరుగులు పెట్టింది. అయితే శనివారం బంగారం ధరలు తగ్గాయి. అత్యధికంగా చెన్నైలో 10 గ్రాముల బంగారం ధరపై 200 వరకు తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,700కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,160 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,490 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,750 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 గా ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 వద్ద కొనసాగుతోంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,860 వద్ద కొనసాగుతోంది.

కాగా, బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

Polavaram Project: ఢిల్లీకి వెళ్లి ఆ నిధులు వచ్చేలా చూడండి.. అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం..

Corona Spread: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలు.. ఐసీఎంఆర్ నివేదికలో ఆసక్తికర అంశాలు..

Green India Challeng: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం.. ఎంపీ సంతోష్‌ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..