EV Monsoon Precautions: ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ పాటించాల్సిందే..

|

Jul 27, 2024 | 6:23 PM

అదే సమయంలో మనం వినియోగించే వాహనాల విషయంలో కూడా ఈ వర్షాల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో ఎలక్ట్రిక్ బైక్‌లు,స్కూటర్‌లకు ఎలాంటి నష్టం జరగకుండా ఎలా ఉంచుకోవాలో కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి.

EV Monsoon Precautions: ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ పాటించాల్సిందే..
Electric Scooter In Rain
Follow us on

ప్రస్తుతం వర్షాకాలంలో మనం ఉన్నాం. వర్షాలు కాస్త ఆలస్యంగా మొదలైనా.. గత రెండు, మూడు వారాలుగా రోజూ దంచి కొడుతున్నాయి. ఏ సమయంలో వర్షం పడుతుంది? ఏ సమయంలో వర్షం కురవడం లేదో అర్థం కావడం లేదు. ఈ సమయంలో వ్యక్తిగతంగా మనం ఇబ్బందులు పడతాం.. సీజనల్ వ్యాధులు కూడా చుట్టుముడుతుంటాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో మనం వినియోగించే వాహనాల విషయంలో కూడా ఈ వర్షాల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి.
ఈ వర్షాకాలంలో ఎలక్ట్రిక్ బైక్‌లు,స్కూటర్‌లకు ఎలాంటి నష్టం జరగకుండా ఎలా ఉంచుకోవాలో కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి.

సేఫ్ పార్కింగ్..

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసే స్థలం చాలా ప్రధానమైనది. అది వేడి వాతావరణం అయినా, వర్షాల సమయం అయినా? జాగ్రత్తలు తప్పనిసరి. పార్క్ చేసే ప్రదేశం సురక్షితంగా ఉండాలి. వాహనాన్ని షెల్టర్ లేదా కవర్ ఏరియా కింద పార్క్ చేయండి. సాధ్యం కాకపోతే, వాహనంపై ఒక కవర్ పరచండి. ఎక్కువసేపు వర్షానికి గురికావడం వల్ల తేమ పేరుకుపోతుంది, దీని ఫలితంగా కొంత కాలం తర్వాత బండి తప్పు పట్టి పోతుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) సాధారణ ఐసీఈ-శక్తితో పనిచేసే వాహనాల కంటే చాలా ఎక్కువ ఎలక్ట్రికల్ భాగాలను కలిగి ఉంటాయి. కాబట్టి, ఈవీని పార్క్ చేసే చోట చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను చెట్లు లేదా స్తంభాల దగ్గర పార్క్ చేయకూడదు. అవకాశం ఉన్నంత వరకూ సెంటర్ స్టాండ్‌పై పార్కింగ్ చేచయాలి.

చార్జింగ్ పరికరాలను సురక్షితంగా ఉంచండి..

ఛార్జింగ్ కాంపోనెంట్స్‌లోకి నీరు చేరకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ బూట్ లోపల చార్జింగ్ పరికరాలను నిల్వ ఉంచడం మానుకోండి. ఛార్జర్‌కు తేమ చేరితే చార్జింగ్ పరికరాన్ని మాత్రమే కాకుండా బ్యాటరీని కూడా దెబ్బతీస్తుంది. పరికరాలలోని నీరు షార్ట్ సర్క్యూట్‌కు కారణం కావచ్చు. అలాగే, భారీ వర్షాల సమయంలో పబ్లిక్ చార్జింగ్ స్టేషన్‌లను ఉపయోగించకుండా ఉండండి.

బ్యాటరీ ఆరోగ్యాన్ని తనిఖీ చేయండి..

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బ్యాటరీని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. ఏదైనా ఇన్సులేషన్ లేదా కనెక్టర్ సమస్యలుంటే వెంటనే సరిచేయండి. మీకు కుదరకపోతే బండి స్టార్ట్ చేయకుండా అధీకృత సర్వీసె స్టేషన్ కి తీసుకెళ్లండి.

నీటితో నిండి ఉన్న రోడ్లపై ప్రయాణం వద్దు..

ఆధునిక ఈవీలు తక్కువ స్థాయి నీటిలో ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, మితమైన స్థాయి కంటే ఎక్కువ ఏదైనా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కోసం డూమ్‌డేని సూచిస్తుంది. ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్‌ల అంతర్గత భాగాలు సున్నితమైన ఎలక్ట్రానిక్‌లు, సెన్సార్‌లతో నిండి ఉంటాయి. అవి నీటిలో తడిస్తే పాడైపోయే అవకాశం ఉంది. పైగా ఇవి బాగా ఖరీదైనవి కూడా.

సరైన బీమా కవరేజీ అవసరం..

మన దేశంలో వాహనాలకు బీమా తప్పనిసరి. అయితే చాలా బీమా పాలసీలు వరద నష్టాన్ని ప్రామాణికంగా చేర్చడం లేదు. బదులుగా వరద రక్షణను యాడ్ ఆన్ కవరేజీగా ఎంచుకోవాలి. కచ్చితంగా, ఇది ప్రామాణిక బీమా కంటే ఎక్కువ ఖర్చవుతుంది. కానీ భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఎక్కువ కవరేజీని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..