Fixed deposits: మూడేళ్ల ఎఫ్‌డీ.. అదిరే వడ్డీ.. ఏ బ్యాంకుల్లో అంటే..

|

Oct 11, 2024 | 7:03 AM

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరసగా పదోసారి రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే డిసెంబర్ లో జరిగే బ్యాంకింగ్ రెగ్యులేటర్ సమావేశంలో ఈ రేటు తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ మార్పు రుణాలు, డిపాజిట్లపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పుడే ఎఫ్ డీలపై డబ్బులను పెట్టుబడి పెట్టడం చాలా మంచిది.

Fixed deposits: మూడేళ్ల ఎఫ్‌డీ.. అదిరే వడ్డీ.. ఏ బ్యాంకుల్లో అంటే..
Fd Offer
Follow us on

సాధారణంగా ఎవరి వద్దనైనా డబ్బులు ఉన్నా, పెద్ద మొత్తంలో సొమ్ము లభించినా బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజట్లు (ఎఫ్ డీ) చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ పథకాలపై ప్రజలకు నమ్మకం ఎక్కువ. నిర్ణీత కాల వ్యవధిలో ఎంత సొమ్ము తిరిగి వస్తుందో ముందుగానే తెలుస్తుంది. బ్యాంకుల్లో మన సొమ్ము కు పూర్తిస్థాయిలో భద్రత ఉంటుంది. ఈ కారణాలతో వివిధ బ్యాంకులు అందించే ఎఫ్ డీ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి అందరూ ముందుకు వస్తారు. ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడికి కొంత వడ్డీ వస్తే చాలు అనుకునే వారికి ఇవి ఎంతో బాగుంటాయి. అలాగే సీనియర్ సిటిజన్లకు చాలా ఉపయోగంగా ఉంటాయి. సాధారణ ఖాతాదారులతో పోల్చితే వారికి వడ్డీరేటు ఎక్కువ అందిస్తారు. అయితే ఎఫ్ డీలలో డబ్బులను ఇన్వెస్ట్ చేసేముందు కొన్ని విషయాలను గమనించాలి. ముఖ్యంగా వడ్డీరేటును తెలుసుకోవడం చాలా అవసరం.

వడ్డీరేట్లు ఇలా..

ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీరేట్ల ఆయా బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. డిపాజిట్ చేసే ముందు ఎక్కువ వడ్డీని అందించే బ్యాంకును ఎంపిక చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరసగా పదోసారి రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే డిసెంబర్ లో జరిగే బ్యాంకింగ్ రెగ్యులేటర్ సమావేశంలో ఈ రేటు తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ మార్పు రుణాలు, డిపాజిట్లపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పుడే ఎఫ్ డీలపై డబ్బులను పెట్టుబడి పెట్టడం చాలా మంచిది.

మూడేళ్ల డిపాజిట్లకు..

బ్యాంకుల్లో దీర్ఘకాలిక డిపాజిట్లకు సాధారణంగా వడ్డీరేటు అధికంగా ఉంటుంది. కాల వ్యవధి ఎక్కువ ఉండడం కాబట్టి ఈ విధానం సరైనదే. అయితే వివిధ బ్యాంకులు మూడేళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్లకు మంచి వడ్డీని అందజేస్తున్నాయి. ఇవి ఏడాది, ఆరు నెలల వంటి స్వల్పకాలిక ఎఫ్ డీల కంటే ఎక్కవగా ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీ అందజేస్తున్నారు

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్ డ్ డిపాజిట్లకు సాధారణ ఖాతాదారులకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు రూ.7.25 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఈ రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
  • బ్యాంకు ఆఫ్ బరోడాలో సాధారణ ఖాతాదారులకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం వడ్డీని ఇస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి ఈ రేట్లను బ్యాంకు అమలు చేస్తోంది.
  • కోటక్ మహీంద్రా బ్యాంకులో సాధారణ పౌరులకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం అందజేస్తున్నారు. ఈ వడ్డీరేట్లు జూన్ 14 నుంచి అమలవుతున్నాయి.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జూలై 24 నుంచి కొత్త వడ్డీరేట్లను అమలు చేసింది. ఎఫ్ డీలపై సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం అందజేస్తోంది.
  • యాక్సిస్ బ్యాంకు కూడా తన ఎఫ్ డీలపై వడ్డీరేట్లను సవరించింది. సాధారణ ఖాతాదారులకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం అందిస్తోంది. సెప్టెంబర్ 10 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకులో కూడా ఇవే రేట్లు అమలుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..