Tax Loophole: పన్ను బాదుడి నుంచి తప్పించుకునేందుకు సంపన్నుల ఎత్తుగడ.. విదేశాల్లో ఆ పని చేస్తున్నారా..?

|

Oct 02, 2024 | 5:00 PM

విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసే ధోరణి భారతీయుల్లో వేగంగా పెరుగుతుంది. చాలా మంది తమ మైనర్ పిల్లల పేరుతో ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితుల్లో ఉంటూనే అధిక విలువ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే ఇలాంటి పనుల్లో చేసే చిన్నపాటు తప్పులు గణనీయమైన జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో పెట్టుబడి పెట్టే వారు ఆర్‌బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద మైనర్ల ద్వారా విదేశాలకు డబ్బు పంపుతున్నారు.

Tax Loophole: పన్ను బాదుడి నుంచి తప్పించుకునేందుకు సంపన్నుల ఎత్తుగడ.. విదేశాల్లో ఆ పని చేస్తున్నారా..?
Income Tax
Follow us on

విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసే ధోరణి భారతీయుల్లో వేగంగా పెరుగుతుంది. చాలా మంది తమ మైనర్ పిల్లల పేరుతో ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితుల్లో ఉంటూనే అధిక విలువ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే ఇలాంటి పనుల్లో చేసే చిన్నపాటు తప్పులు గణనీయమైన జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో పెట్టుబడి పెట్టే వారు ఆర్‌బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద మైనర్ల ద్వారా విదేశాలకు డబ్బు పంపుతున్నారు. ఆర్‌బీఐ సరళీకృత చెల్లింపుల పథకం కింద ఒక వ్యక్తి ఆస్తి కొనుగోళ్లతో సహా ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు 2,50,000 డాలర్లు (సుమారు రూ. 2.08 కోట్లు) కంటే ఎక్కువ చెల్లించకూడదు. ఆగస్టు 24, 2022 నుంచి అమల్లోకి వచ్చిన సవరణ ప్రకారం, విదేశాలకు పంపిన మొత్తాన్ని 180 రోజులలోపు పెట్టుబడి పెట్టకపోతే, దానిని తిరిగి భారతదేశానికి తీసుకురావాలి. ఈ నిబంధన నుంచి తప్పించుకునేందుకు సంపన్నులు విదేశాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. 

ముఖ్యంగా మైనర్లను ఆస్తిని కొనుగోలు చేయడానికి తగిన నిధులను సేకరించేందుకు ఉపయోగిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పొందిన బహుమతులను ఉపయోగించి మైనర్లు ఎల్ఆర్ఎస్ కింద విదేశాలకు డబ్బును పంపవచ్చు. అలాంటి బహుమతులపై భారతదేశంలో పన్ను విధించరు.  విదేశీ ఆస్తులను కలిగి ఉన్న ప్రతి భారతీయ పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటిఆర్) దాఖలు చేసేటప్పుడు వాటిని తప్పనిసరిగా ప్రకటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విదేశీ ఆస్తుల నుంచి ఆదాయం వస్తే అది తప్పనిసరిగా షెడ్యూల్ ఎఫ్ఎస్ఐలో నివేదించాలి. కచ్చితమైన వివరాలు అందించడంలో విఫలమైతే బ్లాక్ మనీ చట్టం కింద రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.  

ఒక విదేశీ ఆస్తి అద్దె ఆదాయం వంటి ఆదాయాన్ని సృష్టిస్తే, అది తల్లిదండ్రుల ఆదాయంతో కలుపుతారు. ఆదాయాన్ని మరొక వ్యక్తికి లింక్ చేసినట్లయితే ‘లబ్దిదారు’ (పిల్లవాడు) పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ విషయం సంక్లిష్టంగా ఉంటుంది. మైనర్ విదేశాల్లో ఆస్తికి సహ యజమాని అయితే అతనిని లబ్ధిదారుడు కింద గుర్తించి భారతీయ పన్ను నియమాలు ఆదాయాన్ని కలపడానికి అనుమతిస్తాయి కాని ఆస్తి యాజమాన్యాన్ని క్లబ్‌బింగ్ చేయడానికి ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి