
WhatsApp: నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్ మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగ సంబంధిత విషయాలతో పాటు వివిధ సంస్థలు, బ్రాండ్లు కూడా వాట్సాప్ ద్వారా వినియోగదారులను సంప్రదిస్తున్నాయి. ముఖ్యమైన వ్యక్తిగత లేదా పని సంబంధిత మెసేజ్‌ల మధ్య ఈ ప్రమోషనల్ సందేశాలు చేరడంతో అవసరమైన మెసేజ్‌ను గుర్తించడం కూడా కష్టమవుతుంది. అయితే, బ్రాండ్‌ల నుండి నిరంతరం వచ్చే ప్రమోషనల్ మెసేజ్‌లు ఒక్కోసారి చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన సందేశాలను కోల్పోయేలా చేస్తాయి. ఈ సమస్యకు ఒక అద్భుతమైన, సులభమైన పరిష్కారం ఉంది. ఈ ట్రిక్ ద్వారా మీరు అనవసరమైన ప్రమోషనల్ మెసేజ్‌లకు సులభంగా అడ్డుకట్ట వేయవచ్చు.
ఏదైనా బ్రాండ్ నుండి వచ్చే ప్రమోషనల్ మెసేజ్‌లు మీకు వద్దు అనుకుంటే, మీరు చేయాల్సిందల్లా ఆ బ్రాండ్ వాట్సాప్ చాట్‌ను తెరవడం. అక్కడ క్యాపిటల్ లెటర్స్‌లో STOP అని టైప్ చేసి పంపాలి. మీరు మెసేజ్ పంపిన వెంటనే, ఆ బ్రాండ్ నుండి మీకు ఒక నిర్ధారణ సందేశం వస్తుంది. ఆ తర్వాత ఆ బ్రాండ్ నుండి ఎటువంటి ప్రమోషనల్ మెసేజ్‌లు మీకు రావు. ఇది చాలా సులభమైన పద్ధతి. అలాగే మీ వాట్సాప్ ఇన్‌బాక్స్‌ను అనవసరమైన సందేశాల నుండి కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి! House Construction: గోడల్లో పగుళ్లు ఎందుకు వస్తాయి? ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
ఒకవేళ మీరు భవిష్యత్తులో ఆ బ్రాండ్ నుండి ప్రమోషనల్ మెసేజ్‌లను తిరిగి పొందాలనుకుంటే, అదే చాట్‌లో క్యాపిటల్ లెటర్స్‌లో START అని టైప్ చేసి పంపాలి. అప్పటినుండి ఆ బ్రాండ్ నుండి మీకు మళ్లీ ప్రమోషనల్ సందేశాలు రావడం మొదలవుతాయి. ఈ ట్రిక్ ద్వారా మీ వాట్సాప్ మెసేజ్ అనుభవంపై పూర్తి నియంత్రణ సాధించవచ్చు. అలాగే ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టవచ్చు.
కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రముఖ బ్రాండ్లు, బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ వాట్సాప్ మెసేజ్‌లు పంపే అవకాశం ఉంది. డిస్కౌంట్, రివార్డ్, క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ లేదా అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పి లింక్‌పై క్లిక్ చేయమని అడిగితే అప్రమత్తంగా ఉండాలి.
ఇది కూడా చదవండి: lipkart, Amazon: ఫెస్టివల్ సేల్స్‌లో 80% డిస్కౌంట్ ఇచ్చినా.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కోట్లలో లాభాలు ఎలా వస్తాయి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి