
సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. సిమ్ కార్డు మోసాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఒకరి పేరుతో మరొకరు సిమ్ కార్డు తీసుకోవడం, సిమ్ కార్డులను ట్యాపరింగ్ చేయడం వంటి మోసాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు కేంద్రం ఇటీవల కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇకపై ఒక వ్యక్తి తన పేరుపై గరిష్టంగా తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోకుండా టెలికాం శాఖ పరిమితులు విధించింది. మీ పేరుపై ఇప్పటికే తొమ్మది సిమ్ కార్డులు నమోదై ఉంటే.. కొత్త సిమ్ జారీ చేయరు. దీంతో పాటు ఒక వ్యక్తి తన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనేది తెలుసుకునేందుకు వీలుగా సంచార్ సౌథీ అనే వెబ్ సైట్ ప్రవేశపెట్టింది. దీని వల్ల ప్రజలు తమ పేరుపై ఏదైనా నకిలీ సిమ్ కార్డు ఉంటే గుర్తించి ఫిర్యాదు చేయవచ్చు. దీని వల్ల మోసాలు తగ్గుతాయని కేంద్రం చెబుతోంది.
కొంతమంది మోసగాళ్లు వ్యక్తుల ఆధార్ కార్డులను ఏదొక విధానంలో పొంది వారి పేరుతో సిమ్‌లను తీసుకుంటున్నారు. ఈ సిమ్‌లను తమ మోసాలకు ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అసలు గుర్తింపుదారుడు ఇబ్బందుల్లో పడే అవకాశముంది. మొబైల్ సిమ్ పొందాలంటే ఆధార్ కార్డు అనేది ఇప్పటి రోజుల్లో తప్పనిసరి అయింది. దీంతో మీ ఆధార్ కార్డుతో ఎన్ని మొబైల్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయనేది మీరు సులువుగా తెలుసుకోవచ్చు. మీకు సంబంధం లేని నెంబర్ ఉంటే వెంటనే అప్రమత్తమై ఫిర్యాదు చేయవచ్చు. సంచార్ సౌథీ యాప్ ద్వారా మీ ఆధార్‌తో అనుసంధానించబడ్డ మొబైల్ నెంబర్లను ఎలా తెలుసుకోవాలి? అనేది చూద్దాం.
-https://sancharsaathi.gov.in/Home/index.jsp# పోర్టల్‌కి వెళ్లండి
-హోమ్ పేజీలో know Mobile Connections In Your Name అనే ఆప్షన్ ఎంచుకోండి
-అనంతరం మీ మొబైల్ నెంబర్, క్యాప్చా, ఎంటర్ చేయండి
-అనంతరం మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి
-మీ పేరుపై ఉన్న మొబైల్ నెంబర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి
-మీకు తెలియని నెంబర్ కనిపిస్తే.. పక్కనే ఉండే కంప్లైంట్ ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయండి
-పరిశీలన అనంతరం మీ పేరుపై ఉన్న నెంబర్ తొలగిస్తారు.
మొబైల్ నెంబర్లు బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగిస్తాం. బ్యాంక్ అకౌంట్లతో ముడిపడి ఉంటాయి. బ్యాంకింగ్ ఓటీపీల కోసం మొబైల్ నెంర్ అవసరం. అయితే ఫోన్లు హ్యాక్ చేసి మోసగాళ్లు మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీలను పొందే అవకాశముంది. దీంతో ప్రభుత్వం సిమ్ కార్డులకు కేవైసీ నిబంధనలను కఠినతరం చేసింది. సిమ్ కార్డు తీసుకోవాలంటే ఖచ్చితంగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక మొబైల్ నెంబర్ ఇనాక్టివ్ అయితే మళ్లీ జారీ చేయడానికి 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ విధించింది. డీయాక్టివేట్ చేసిన