Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. మహిళలకు షాకిస్తున్న సిల్వర్‌ ధరలు.. అక్కడ మాత్రం భారీగా తగ్గింది..

|

Nov 03, 2021 | 5:40 AM

Silver Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా బంగారం బాటలోనే వెండి కూడా..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. మహిళలకు షాకిస్తున్న సిల్వర్‌ ధరలు.. అక్కడ మాత్రం భారీగా తగ్గింది..
Follow us on

Silver Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెట్టింది. అయితే తాజాగా బంగారం ధర పెరుగగా, అదే బాటలో వెండి పయనిస్తోంది. బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. భారతీయులు బంగారం, వెండికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. దేశంలో బంగారం, వెండికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. ఇక బుధవారం (నవంబర్‌ 3)న దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ.200 నుంచి 300 వరకు ఎగబాకింది. అయితే కేరళలో మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.4వేల వరకు తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.64,700.
► చెన్నైలో కిలో వెండి ధర రూ.68,900.
► ముంబైలో కిలో వెండి రూ.64,700.
► కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,700.
► బెంగళూరులో కిలో వెండి రూ.64,700.
► కేరళలో కిలో వెండి ధర రూ.64,700.
► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,900.
► విజయవాడలో రూ. 68,900 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వినియోగదారులు బంగారం, వెండి కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరిగిన పసిడి రేట్లు.. తాజా ధరల వివరాలు

Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!