Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.64,800లుగా ఉంది. కిలో వెండిపై రూ.1200మేర తగ్గింది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లోనే వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.64,800 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.69,200లుగా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.64,800 గా కొనసాగుతోంది.
* కోల్కతాలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.64,800గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.69,200 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలో వెండి ధర రూ.69,200 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.69,200 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
Gold Price Today: గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Health: మీ శరీరంలో అనూహ్యంగా ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే మీరు బరువు పెరుగుతున్నట్లే లెక్క..