Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తాజాగా ఎంత రేటు పెరిగిందంటే..?

|

Apr 03, 2021 | 5:01 AM

Today Silver Price: బంగారం ధరలు, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వీటి ధరల్లో నిత్యం వ్యత్యాసం ఉంటుంది. దేశంలో చోటు చేసుకుంటున్న

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తాజాగా ఎంత రేటు పెరిగిందంటే..?
Silver Price Today
Follow us on

Today Silver Price: బంగారం ధరలు, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వీటి ధరల్లో నిత్యం వ్యత్యాసం ఉంటుంది. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం లాగానే… శనివారం కూడా వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం 63,600 ఉన్న కిలో వెండి.. శనివారం ఏకంగా 65,000లకు పెరిగింది. అంటే మరో 1,400 రూపాయలు అదనంగా పెరిగింది. అయితే దేశంలోని ప్రధాన నగరాలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,000 లుగా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కిలో వెండి రూ.65,000 ఉంది.
చెన్నైలో రూ.70,000 ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది.
బెంగళూరులో రూ.64,800 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.65,000 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.70,000 లు ఉంది. విజయవాడలో కూడా వెండి రూ.70,000 వద్ద కొనసాగుతోంది.

బంగారం..
ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,090 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,090 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Fruits for Strong Bones: ఇలాంటి పండ్లతో ఎముకలను దృఢంగా తయారు చేసుకోవచ్చు తెలుసా..? అవి ఏంటంటే..?