Egg Price: ఇండియాలో గుడ్డు ధర రూ.9.. మరి పాకిస్థాన్‌లో ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Pakistan Egg Price: మిడిల్ క్లాస్ ఇళ్లల్లో నాన్ వెజ్‌కి ప్రత్యామ్నాయంగా ఉన్న గుడ్డు ధర చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. కోళ్ల ఫారాల దగ్గరే రికార్డు స్థాయికి ధర చేరగా.. ఇక బయట మార్కెట్లలో ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..

Egg Price: ఇండియాలో గుడ్డు ధర రూ.9.. మరి పాకిస్థాన్‌లో ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Pakistan Egg Price

Updated on: Jul 29, 2026 | 2:12 PM

Pakistan Egg Price: నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా కోడిగుడ్డు ధర కూడా ఆకాశాన్ని తాకింది. అయితే అక్కడ మాత్రం ఒక గుడ్డు ధర ఏకంగా 26 రూపాయలపైనే పలుకుతోంది. ఇంత ధర ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇది మన దేశంలో కాదు. పాకిస్తాన్‌లో. మిడిల్ క్లాస్ ఇళ్లల్లో నాన్ వెజ్‌కి ప్రత్యామ్నాయంగా ఉన్న గుడ్డు ధర చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. కోళ్ల ఫారాల దగ్గరే రికార్డు స్థాయికి ధర చేరగా.. ఇక బయట మార్కెట్లలో ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సడెన్‌గా పెరిగిన ఈ కోడి గుడ్డు రేటుతో అక్కడి సామాన్యుడు సతమతమవుతున్నాడు.

లాహోర్, ఫైసలాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఒక డజను గుడ్ల ధర PKR 230 నుండి PKR 275 వరకు ఉంది. రీటైల్ మార్కెట్‌లో స్థానిక కిరాణా షాపుల్లో డజను గుడ్లు PKR 260 నుండి PKR 315 వరకు విక్రయిస్తున్నారు. (అంటే ఒక గుడ్డు ధర దాదాపు PKR 22 నుండి PKR 26 వరకు పడుతుంది). స్థానిక హోల్‌సేల్ మార్కెట్ విభాగాలను బట్టి 100 గుడ్ల ప్యాక్ ధర PKR 565 నుండి PKR 786 వరకు ఉంటుంది. అంటే అక్కడ ఒక్క గుడ్డు ధర వచ్చేసి 25 నుంచి 26 రూపాయలు పడుతుంది. అంటే అక్కడి కరెన్సీతో పోలిస్తే మన ఇండియాలో 9.04 రూపాయలు.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు బిగ్‌ అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?

ఇవి కూడా చదవండి

కోడి గుడ్లను కొనాలంటేనే పాకిస్థానీలు వణికిపోతున్నారు. పౌల్ట్రీ ఫామ్‌లలో ఉపయోగించే సోయాబీన్‌ సరఫరా తగ్గిపోవడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని పాక్ వ్యాపార వర్గాలు తెలిపాయి. దీంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు రిటైల్ ధర సుమారు రూ. 7 నుండి రూ. 8.50 వరకు ఉంది. హోల్‌సేల్ మార్కెట్‌లో వంద గుడ్ల ధర దాదాపు రూ. 650 నుండి రూ. 695 మధ్య ఉంది. ఇక ట్రే ధర (30 గుడ్లు) ధర సుమారు రూ. 175 – రూ. 210 ఉంది.

ఇది కూడా చదవండి: Business Ideas: రూ. 50 వేల పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారం.. నెలకు లక్షల్లో సంపాదనకు బెస్ట్ ఐడియా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us