RBI: బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపొచ్చు.. అమల్లోకి వచ్చేసింది.. ఎలానో చూడండి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయ తీసుకుంది. ఇక నుంచి డబ్బులు పంపించాలన్నా లేదా అందుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. అవును.. నేరుగా నెఫ్ట్ ప్రక్రియ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తికి ఖాతా లేని వ్యక్తి బ్యాంక్‌కు వెళ్లి పంపించవచ్చు.

RBI: బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపొచ్చు.. అమల్లోకి వచ్చేసింది.. ఎలానో చూడండి..
Rbi

Updated on: Nov 13, 2026 | 9:22 PM

ఇప్పటివరకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. తమ బ్యాంక్ అకౌంట్ ద్వారా వేరేవారికి నగదు ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా ఇతరుల నుంచి నగదు అందుకోవడం లాంటి లావాదేవీలు నిర్వహించుకునే అవకాశముంది. కానీ ఇక నుంచి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సరే నగదు బదిలీ చేయవచ్చు. బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయడం, నగదు లావాదేవీలను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకింగ్ సేవలు అందరికీ సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త మార్పు తీసుకొచ్చింది. బుధవారం నుంచే ఈ నూతన నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది.

బ్యాంక్ అకౌంట్ లేకుండా పంపడం ఎలా..?

బ్యాంక్ ఖాతా లేని వ్యక్తి నేరుగా ఏదైనా బ్యాంకుకు వెళ్లి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) సదుపాయం ద్వారా లబ్ధిదారుని బ్యాంక్ అకౌంట్‌కు రూ.50 వేల వరకు పంపించవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తులకు కూడా అకౌంట్ ఉన్నవారు డబ్బులు సెండ్ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు నగదు బదిలీ చేయడం ద్వారా సమీపంలోని ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్లు(BC పాయింట్లు) లేదా అధీకృత కేంద్రాల ద్వారా నగదు రూపంలో ఖాతా లేని వ్యక్తి తీసుకోవచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ. 10 వేల వరకు పంపుకునే అవకాశం ఉండగా.. నెలవారీ పరిమితి రూ.25 వేలుగా నిర్ణయించారు.

ఏయే పత్రాలు సమర్పించాలి

నగదు పంపేవారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో పాటు స్వీయ ధృవీకరించిన అధికారిక గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. లావాదేవీల భద్రత కోసం అదనపు ప్రామాణీకరణ అంశాలను అమలు చేయనున్నారు. అలాగే అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించేందుకు వెలాసిటీ చెక్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు కూడా జారీ చేసింది. నగదు జమ అయితే వెంటనే వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు అందనున్నాయి. దీని ద్వారా మోసాలకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ఈ మేరకు బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించింది. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల ఇక నుంచి డబ్బులు పంపించాలన్నా, అందుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. పరిమిత మొత్తంలో అకౌంట్ లేకపోయినా సరే లావాదేవీలు సులువుగా నిర్వహించుకోవచ్చు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపర్చడం, ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థ ఎంతవరకు పటిష్టంగా పనిచేస్తుందో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us