Gold loans: లోపాలు సరిదిద్దుకోండి.. గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థలకు ఆర్బీఐ వార్నింగ్..

|

Oct 13, 2024 | 5:49 PM

ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దానిపై బ్యాంకులు ఇచ్చే రుణ పరిమాణం కూడా ఎక్కువైంది. బ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చే రుణాలలో ఎక్కువగా బంగారం మీద ఇచ్చేవే అధికంగా ఉంటున్నాయి. అయితే కొన్ని సంస్థలు బంగారం రుణాల విషయంలో నిబంధనలు పాటించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించింది. ఆ లోపాలను సరిదిద్దుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

Gold loans: లోపాలు సరిదిద్దుకోండి.. గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థలకు ఆర్బీఐ వార్నింగ్..
Gold Loans
Follow us on

సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి మార్గాలలో బంగారం కొనుగోలు ఒకటి. దీని ధర పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ తగ్గదు. అందుకే చాలామంది తమ డబ్బులను బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి నెలా చేసిన పొదుపుతో బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే అత్యవసర సమయంలో డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలా చూసినా బంగారం కొనుగోలు వల్ల ప్రయోజనమే కానీ నష్టం ఉండదు. ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దానిపై బ్యాంకులు ఇచ్చే రుణ పరిమాణం కూడా ఎక్కువైంది. బ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చే రుణాలలో ఎక్కువగా బంగారం మీద ఇచ్చేవే అధికంగా ఉంటున్నాయి. అయితే కొన్ని సంస్థలు బంగారం రుణాల విషయంలో నిబంధనలు పాటించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించింది. ఆ లోపాలను సరిదిద్దుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

అవకతవకలు..

ఆర్బీఐ సెప్టెంబర్ 30వ తేదీన ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్నిగోల్డ్ లోన్ సంస్థలు బంగారు ఆభరణాల రుణాలను మంజూరు చేసే విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా మదింపు, డ్యు డిలిజెన్స్, ఎండ్ యూజ్ మానిటరింగ్, వేలం పారదర్శకత, లోన్ లు వాల్యూ (ఎల్ టీవీ) మానిటరింగ్, రిస్క్ వెయిట్ అప్లికేషన్ లో గణనీయమైన లోపాలు ఉన్నట్టు స్పష్టం చేసింది. వీటిని మూడు నెలల్లో సరిచేసుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

జాగ్రత్త అవసరం..

బంగారు రుణాలు తీసుకునేవారు కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి. ఆర్బీఐ ఆమోదించిన రుణదాతల వడ్డీరేట్లు, చార్జీలను గమనించాలి. దాని ద్వారా మీకు వీలుగా ఉండే రుణదాతను ఎంచుకునే వీలుంటుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్ టెక్ రుణదాతలు ప్రకటించిన ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి. వాటి వెనుక కొన్ని కఠినమైన నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారం రుణాల విషయంలో వడ్డీరేట్లు, చార్జీలు, వాయిదాల విషయంలో తేడాలు ఉంటే అవకాశం ఉంది. కాబట్టి రుణం తీసుకునే ముందే రుణదాతపై అవగాహన పెంచుకోవాలి. నిబంధనలను పూర్తిగా తెలుసుకుని, ఏవైనా సందేహాలు ఉంటే తీర్చుకోవాలి.

బంగారు రుణాలపై వడ్డీరేట్లు..

బంగారం రుణాలపై బ్యాంకులు వివిధ రకాల వడ్డీరేట్లు వసూలు చేస్తున్నాయి. ఇండియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా 8.80 శాతం చొప్పున, కోటక్ మహీంద్ర బ్యాంకు 9 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 9.10 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 9.15 శాతం, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు 9.25 శాతం, యూనియన్ బ్యాంకు 9.95 శాతం, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 10.20 శాతం, యాక్సిస్ బ్యాంకు 17 శాతం వడ్డీ విధిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..