
Post Office: సురక్షితమైన పెట్టుబడితో పాటు కచ్చితమైన లాభాలను ఆశించే పెట్టుబడిదారులకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (Time Deposit – TD) పథకం ఒక అద్భుతమైన ఎంపిక. ఇది భారత ప్రభుత్వం ద్వారా నిర్వహించే పథకం ఇది. అందుకే మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన వడ్డీ లభిస్తుంది.
ఈ పథకం ప్రధాన ఆకర్షణ ఏమిటంటే మీరు ఒకవేళ రూ. 2,25,000 మొత్తాన్ని 5 ఏళ్ల కాలపరిమితితో డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయానికి మీకు కేవలం వడ్డీ రూపంలోనే రూ. 98,016 లభిస్తుంది. అంటే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి మొత్తం రూ. 3,23,016 అందుతాయి.
ఇది కూడా చదవండి: Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్‌టైమ్ హై కంటే తక్కువే!
1 సంవత్సరం: 6.9%
2 ఏళ్లు: 7.0%
3 ఏళ్లు: 7.1%
5 ఏళ్లు: 7.5% (అత్యధిక లాభం)
వడ్డీ లెక్కింపు: వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) లెక్కిస్తారు. కానీ ఏటా మీ ఖాతాలో జమ చేస్తారు. దీనివల్ల చక్రవడ్డీ (Compound Interest) ప్రయోజనం లభిస్తుంది.
పన్ను ఆదా చేయాలనుకునే వారికి 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ ఉత్తమమైనది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం రిస్క్ లేని పెట్టుబడి పెట్టాలని భావించే వారికి, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వడ్డీని ఇచ్చే ఈ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం ఒక గొప్ప వరం.
ఇది కూడా చదవండి: SBI FD Interest: ఎస్‌బీఐ 444 రోజుల ఎఫ్‌డీలో రూ.2,50,000 పెట్టుబడిపై మీకు ఎంత వడ్డీ లభిస్తుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి