PM Kisan: ఈ ఐదు తప్పులు చేస్తే పీఎం కిసాన్ సాయం కట్.. రైతులకు కేంద్రం సూచనలు.

జూన్ 20వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. కానీ ఇప్పటికీ చాలామంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు నిధులు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు. డబ్బులు నిలిచిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

PM Kisan: ఈ ఐదు తప్పులు చేస్తే పీఎం కిసాన్ సాయం కట్.. రైతులకు కేంద్రం సూచనలు.
Pm Kisan

Updated on: Jul 06, 2026 | 9:54 PM

జూన్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు పీఎం కిసాన్ నిధులను స్వయంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి నిధులను జమ చేశారు. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.18,880 కోట్లను రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికీ చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే కొన్ని తప్పులు చేయడం వల్ల పీఎం కిసాన్ నగదు అందకపోవచ్చు. కేవైసీ, భూమి రికార్డుల్లో తప్పులు లాంటివి ఉండటం వల్ల నిధులు జమ కావు. ఈ తప్పులను సరిద్దుకోవడం వల్ల మీరు పీఎం కిసాన్ నిధులను వెంటనే పొందవచ్చు. ఈ మేరకు రైతులను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది.

ఈ ఐదు తప్పులు చేయకండి

– రైతులు ఎప్పటికప్పుడు ఈకేవైసీ పూర్తి చేయాలి. వాయిదాలు అందుకోవడానికి రైతులు తమ ఇ-కెవైసిని తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం నిబంధన పెట్టింది. దీంతో కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు అందవు.

– ఆధార్, బ్యాంకు వివరాలు సరిపోలకపోవడం: ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా రికార్డులు లేదా ఇతర రిజిస్ట్రేషన్ వివరాలతో సరిపోలకపోతే డబ్బులు నిలిచిపోతాయి

– తప్పుడు బ్యాంకు ఖాతా సమాచారం: తప్పుడు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ లేదా ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలు ప్రత్యక్ష ప్రయోజన బదిలీని నిలిపివేస్తాయి.

– అనర్హ లబ్ధిదారుడి హోదా: ​​ఆదాయపు పన్ను ఫైలర్లు లేదా నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ పింఛను పొందుతున్న పెన్షనర్లతో సహా అర్హత షరతులను నెరవేర్చని రైతులకు డబ్బులు పడవు.

– లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడం: అసంపూర్ణ ధృవీకరణ లేదా దరఖాస్తు లోపాల కారణంగా రైతు పేరు లబ్ధిదారుల డేటాబేస్‌లో లేకపోతే వాయిదా జమ కాకపోవచ్చు.

ఏడాదికి రూ.6 వేల సాయం

కాగా ఈ పధకం కింద ప్రతి నాలుగు నెలలకు రూ. 2 వేల చొప్పున సంవత్సరానికి రూ. 6 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ డబ్బును ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అనే మూడు విడతల్లో అందిస్తారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు

 

Follow Us