Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరల్లో బిగ్ రిలీఫ్ ఇచ్చిన చమురు కంపెనీలు..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల ఇవాళ కొద్దిగా ఉపశమనం లభించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలకు బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరల్లో బిగ్ రిలీఫ్ ఇచ్చిన చమురు కంపెనీలు..
Petrol Diesel Prices

Updated on: Oct 18, 2021 | 8:21 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల ఇవాళ కొద్దిగా ఉపశమనం లభించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలకు బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు చాలా కొద్దిగా కనిపించాయి. సోమవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.09గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 103.18గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.97గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.05గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 111.01గా ఉండగా.. డీజిల్ ధర రూ. 104.01గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21గా ఉండగా.. డీజిల్ ధర రూ.103.44గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.21 ఉండగా.. డీజిల్ ధర రూ.103.29గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.61పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.71గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.38 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.83 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.90 ఉండగా.. డీజిల్ ధర రూ. 103.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.53లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.104.01గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.80గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.53గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 111.71 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.104.43లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 105.84 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 94.57 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.77కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.52 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.43 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 97.68 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 103.01 ఉండగా.. డీజిల్ ధర రూ.98.92గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.109.53పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.100.37గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.58 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.78గా ఉంది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటి డబ్బును ఎప్పుడూ ముట్టుకోకండి.. వినకుండా టచ్ చేస్తే ఇక అంతే..

Loading...
Unable to load recommendations.
Follow Us