Fuel price today: కొనసాగుతున్న బాదుడు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Jun 09, 2021 | 7:12 AM

Petrol Diesel price today: చమరు కంపెనీలు వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే

Fuel price today: కొనసాగుతున్న బాదుడు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Fuel Price Today
Follow us on

Petrol Diesel price today: చమరు కంపెనీలు వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటాయి. తాజాగా పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా పెట్రోల్ ధరలు వందమార్క్‌కు చేరువులో ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో సెంచరీ మార్క్ దాటి దూసుకెళ్తున్నాయి. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నాటి నుంచి దేశంలో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. గత నెలలో దాదాపు 16 సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా మళ్ల పెరుగుతుండటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దేశవ్యాప్తంగా ధరలు ఎలాఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.

ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.94.76 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.85.66కి చేరింది.
ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.98, డీజిల్ రూ.92.99కు పెరిగింది.
చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.23 ఉండగా.. డీజిల్‌ రూ.90.38గా ఉంది.
కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.76గా.. డీజిల్‌ ధర రూ.88.51 గా ఉంది.
బెంగళూరులో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.92 డీజిల్‌ రూ.90.81 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.52 గా ఉండగా.. రూ. 95.91 గా ఉంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.99.69 ఉండగా.. డీజీల్ ధర రూ.94.03 గా ఉంది.
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.98.48, లీటర్‌ డీజిల్‌ రూ.93.38 కు పెరిగింది.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ గోల్డ్ రేట్స్..

Black Fungus: భయంతో చెట్లన్నీ నరికేస్తున్న ప్రజలు.. వారు చెప్పిన కారణం వింటే షాక్ అవ్వాల్సిందే..