గోల్డ్ అంటేనే ఒక స్టాండర్డ్, ఒక రేటింగ్. గోల్డ్ అంటే ప్రామాణికత. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎంత పేదవారైనా సరే.. ఒంటి మీద వీసమెత్తు బంగారం అయినా ఉండాలే చూసుకుంటారు. అంతెందుకు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మొదలు ముదసలి వారి వరకు బంగారం ధరించడం తప్పనిసరిగా ఉంటుంది. మన వివాహ వ్యవస్థతో బంగారానికి విడదీయరాని బంధం ఉంది. స్టేటస్ సింబల్ గానే కాక.. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకునే వనరుగా పని చేస్తుంది. ఇదే ఉద్దేశంతో చాలా మంది బంగారం కొనడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కోవిడ్ తర్వాత చాలా మంది పుత్తడి రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో చాలా లోహాలున్నప్పటకి.. బంగారానికే అంత క్రేజ్ ఎందుకు..? బంగారం ధర కూడా ఇంత భారీగా ఉండటానికి కారణం ఏంటి..? అసలు బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మనసులో మెదులుతుంటాయి. అయితే ఇలాంటి ప్రశ్నలకు జవాబులను మనం ఈ రోజు తెలుసకుందాం..
సాధారణంగా ఏ దేశంలోని కరెన్సీని ఆ దేశంలోనే ఉపయోగిస్తుంటారు. అయితే అమెరికా డాలర్‌ను పలు ఇతర దేశాల్లోనూ అనుమతిస్తారు. బంగారం విషయంలో అలా కాదు. ఏ దేశమైనా బంగారంతో లావాదేవీలు చేయొచ్చు. అందుకే దానికి అంత డిమాండ్ ఉంటుంది.
మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు.. బంగారం డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు.. బంగారం డిమాండ్ కూడా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుదల, తగ్గుదల కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది.
బంగారం ధరను ఒక సంస్థ కానీ.. ఏదైన ప్రభుత్వం కానీ నిర్ణయించదు. సాధారణ మార్కెట్‌పై ఆధారపడి బంగారం ధర పెరగడం కానీ తగ్గడం కాని ఉంటుంది. బంగారం ధర ఎక్కువగా ఉండేందుకు చాలా కారణాలు ఉన్నాయి. దీని మైనింగ్ కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బంగారం ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. సాధారంగా డిమాండ్ పెరిగినా.. ఉత్పత్తి అంతే స్థాయిలో ఉంటే దాని ధర పెరుగుతుంది. పారిశ్రామికీకరణతో బంగారం ప్రాసెసింగ్ సులభమైనప్పటికీ.. బంగారం ఉత్పత్తి పరిమితంగా ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువ అవుతుంది. దీనితో ధర ఎక్కువగా ఉంటుంది. ఒక స్థాయిలో బంగారం ఉత్పత్తి జరగకపోవచ్చు. దీనితో బంగారం కొనుగోలు చేయాలంటే ఒకరి నుంచి ఒకరికి బదిలీ మాత్రమే కావాలి. దీనితో సాధారణంగానే ధర పెరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను నిర్వహిస్తాయి. కేంద్ర బ్యాంకులు ఇలా చేసినప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మార్కెట్లో కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది. బంగారం సరఫరా తగ్గుతుంది కాబట్టి ఇది జరుగుతుంది.
ప్రపంచ ఉద్యమంలో ఏదైనా మార్పు భారతదేశంలో బంగారం ధరను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అటువంటి పరిస్థితిలో, ఎగుమతి చేసే దేశం ఏదైనా ప్రపంచ కదలిక కారణంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచినప్పుడు, దాని ప్రభావం భారతదేశంలో కనిపిస్తుంది. బంగారం ఖరీదైనది.
ఆర్థిక ఉత్పత్తులు, సేవల వడ్డీ రేట్లు నేరుగా బంగారం డిమాండ్‌కు సంబంధించినవి. ప్రస్తుత బంగారం ధరలు ఏ దేశంలోనైనా వడ్డీ రేట్ల విశ్వసనీయ సూచికగా పరిగణించబడతాయి. వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా, వినియోగదారులు నగదుకు బదులుగా బంగారాన్ని విక్రయించడం ప్రారంభిస్తారు. ఇది బంగారం సరఫరాను పెంచుతుంది మరియు దాని ధర తగ్గుతుంది. అదేవిధంగా, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, బంగారం డిమాండ్ పెరుగుతుంది. దాని ధర కూడా పెరుగుతుంది.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం