గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. LPG సిలిండర్ పై భారీగా ఆఫర్.. చివరితేదీ ఎప్పుడంటే..

| Edited By: Anil kumar poka

Jun 04, 2021 | 6:42 PM

LPG Cylinder Offer: గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారికి ఈ వార్త శుభవార్త అని చెప్పుకొవచ్చు. LPG గ్యాస్ సిలిండర్ భారీగా తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. LPG సిలిండర్ పై భారీగా ఆఫర్.. చివరితేదీ ఎప్పుడంటే..
Lpg Gas Cylinder
Follow us on

గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారికి ఈ వార్త శుభవార్త అని చెప్పుకొవచ్చు. LPG గ్యాస్ సిలిండర్ భారీగా తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ దిగ్గజ ఇవాలెట్ సంస్థ పేటీఎం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అద్బుతమైన ఆఫర్ అందిస్తోంది. LPG సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే.. దాదాపు రూ.800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు లభిస్తుంది. దేశంలో 14 కిలోల గ్యాస్ సిలిండర్ కు రూ. 808-850 వరకు రిటైల్ అవుతుంది. అయితే పేటిఎంలో సిలిండర్ బుక్ చేస్తే దాదాపు రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుండగా.. దాదాపు మీకు గ్యాస్ ఉచితంగానే లభిస్తుంది అన్నమాట.

ఆఫర్ ఎలా అంటే..
ఈ ఆఫర్ పొందడానికి ముందుగా మీ గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం ఇన్ స్టాల్ చేయాలి. ఆ తర్వాత బుక్ గ్యాస్ సిలిండర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్, ఇండెన్ గ్యాస్ ఆప్షన్ లలో మీ డీలర్ షిప్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వంట గ్యాస్ ప్రొవైడర్, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ లేదా ఎల్బీజీ ఐడి వంటి నంబర్లను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లావాదేవీల కోసం వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేసుకోవలి. సిలిండర్ బుక్ చేసేటప్పుడు రూ. 800 క్యాష్ బ్యా్క్ సెలక్ట్ చేసుకోవాలి. పేమెంట్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత 48 గంటల్లో స్క్రాచ్ కార్డును లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ మొదటి సారి గ్యాస్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే లభిస్తుంది. సిలిండర్ బుక్ చేసిన వెంటనే ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది. దీన్ని రుద్దాలి. మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో ఈ కార్డులో ఉంటుంది. మీకు రూ.10 నుంచి రూ.800 వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావొచ్చు. మీరు స్క్రాచ్ కార్డును వారం రోజులోగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కార్డు ఎక్స్‌పైరీ అవుతుంది.

Also Read: “నాకిదే బిగ్గెస్ట్ ఆఫర్” అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ.. ‘హరిహర విరమల్లు’ సినిమాపై నిధి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Son Of India: “నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని.. మోహన్ బాబు డైలాగ్స్‏ .. వెరీ ఇంట్రెస్టింగ్ అంటున్న చిరు