Aadhaar: ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. ఒకరకంగా ఇది మనకు ఒక గుర్తింపు కార్డు లాంటిది. ఏదైనా ఆర్థిక లావాదేవీకి, ప్రభుత్వ పథకాలను పొందడానికి కూడా ఆధార్ కార్డు అవసరం. ఇది వ్యక్తి చిరునామాతో పాటు బయోమెట్రిక్ సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటివరకూ ఆదార్ కార్డు పై సమాచారం ఇంగ్లీషులోనే ఉంటోంది. ఇప్పుడు ఈ విధానంలో మార్పులు తీసుకువచ్చింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). తన తాజా అప్‌డేట్‌లో అనేక ప్రాంతీయ భాషలలో ఆధార్ జనరేషన్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ ద్వారా ప్రాంతీయ భాషలో కార్డు జారీ అవుతుంది.
1 నుంచి 3 వారాలు..
ప్రస్తుత అప్‌డేట్ తర్వాత మీరు పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, మరాఠీ, ఒరియా, కన్నడ భాషలలో ఆధార్ కార్డును పొందవచ్చు. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులోని భాషను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, దాని కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీ భాషను బట్టి భాష అప్‌డేట్ కావడానికి 1 నుంచి 3 వారాలు పడుతుంది.
స్థానిక భాషను ఆధార్‌లో అప్‌డేట్ చేసుకోండి ఇలా..
ఆధార్‌లో మీ స్థానిక భాషను మార్చడానికి మీరు ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లవచ్చు. లేదా దాని కోసం మీరు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే ఇలా చేయండి..
Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?