దేశంలో డీజిల్ వాహనాలపై నిషేధం విధించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని, డీజిల్ ఇంజన్ల వాహనాలపై 10 శాతం జీఎస్టీ విధించాలని కేంద్రం భావిస్తోందని వస్తున్న వార్తలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్) కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని తెలిపారు. అయితే, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలేవీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ‘X’లో పోస్ట్ చేస్తూ ఆయన స్పష్టం చేశారు.
డీజిల్ వాహనాల విక్రయాలపై అదనంగా 10% జీఎస్టీని సూచిస్తూ వస్తున్న మీడియా నివేదికలపై తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం క్రియాశీల పరిశీలనలో అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేయడం చాలా అవసరం. కార్బన్ నెట్ సాధించడానికి కట్టుబాట్లకు అనుగుణంగా
డీజిల్ వాహనాలకు ‘బై-బై’ చెప్పండి. ఈ విషయంలో ఆటో పరిశ్రమ తనవంతుగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రభుత్వం వాటిపై పన్నును పెంచి విక్రయించడం కంపెనీలకు కష్టంగా మారుతుంద నితిన్ గడ్కరీ అంటున్నారు.
కాగా, 2014 నుంచి దేశంలో డీజిల్ కార్ల సంఖ్య తగ్గింది. తొమ్మిదేళ్ల క్రితం మొత్తం కార్లలో ఇవి 33.5 శాతం ఉండగా, ఇప్పుడు 28 శాతానికి తగ్గాయి. ఆటోమొబైల్ పరిశ్రమను డీజిల్‌కు దూరంగా స్వచ్ఛమైన ఇంధన ఎంపికలకు వేగంగా మార్చడమే ప్రభుత్వ ఈ చర్య ఉద్దేశ్యమని గడ్కరీ తెలిపారు. పర్యావరణానికి అనుకూలమైన ఇంధన ఎంపికలపై దృష్టి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
అయితే డీజిల్ వాహనాలకు వీడ్కోలు పలకండి. వాటిని తయారు చేయడం మానేస్తే బాగుటుంది. లేకుంటే కార్లపై పన్ను విధిస్తే కంపెనీలకు ఇబ్బందిగా మారుతుంది అని ఈకార్యక్రమంలో చెప్పారు.
VIDEO | “Pollution is a serious issue and it is causing a health menace too. I’ll be meeting the Finance Minister this evening and will request her that in the coming time, an additional 10 per cent GST be levied on diesel vehicles because people do not seem in the mood to listen… pic.twitter.com/0M8ciDQfQ2
— Press Trust of India (@PTI_News) September 12, 2023
2070 నాటికి కార్బన్ నెట్ జీరోను సాధించడం, డీజిల్ వంటి ప్రమాదకర ఇంధనాల వల్ల ఏర్పడే వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడం, అలాగే ఆటోమొబైల్ అమ్మకాలలో వేగంగా వృద్ధి చెందడం వంటి కట్టుబాట్లకు అనుగుణంగా, చురుకుగా ఉండటం అత్యవసరం. క్లీనర్ అండ్ గ్రీన్ ప్రత్యామ్నాయ ఇంధనాలను స్వీకరించండి. ఈ ఇంధనాలు దిగుమతి ప్రత్యామ్నాయాలు, ఖర్చుతో కూడుకున్నవి, దేశీయమైనవి, కాలుష్య రహితంగా ఉండాలి అని అన్నారు. ప్రస్తుతం, ఆటోమొబైల్స్‌పై 28 శాతం జిఎస్‌టి పన్ను విధిస్తున్నారు. వాహన రకాన్ని బట్టి అదనపు సెస్ 1 శాతం నుంచి 22 శాతం వరకు ఉంటుంది.
There is an urgent need to clarify media reports suggesting an additional 10% GST on the sale of diesel vehicles. It is essential to clarify that there is no such proposal currently under active consideration by the government. In line with our commitments to achieve Carbon Net…
— Nitin Gadkari (@nitin_gadkari) September 12, 2023
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి