Feelo Tooz EV Bike: మార్కెట్‌లోకి సరికొత్త ఈవీ బైక్ లాంచ్.. స్టైలిష్ లుక్ కారుతో పోటీ పడేలా మైలేజ్

|

Apr 27, 2024 | 4:16 PM

ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడానికి ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నారు. తాజాగా టూజ్ ఎలక్ట్రిక్ బైక్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం టూ వీలర్ సెగ్మెంట్‌తో పాటు మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది.

Feelo Tooz EV Bike: మార్కెట్‌లోకి సరికొత్త ఈవీ బైక్ లాంచ్.. స్టైలిష్ లుక్ కారుతో పోటీ పడేలా మైలేజ్
Felo Tooz Ev Bike
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణక మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడానికి ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నారు. తాజాగా టూజ్ ఎలక్ట్రిక్ బైక్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం టూ వీలర్ సెగ్మెంట్‌తో పాటు మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. కంపెనీ త్వరలో తన కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను ఆధునిక స్పెసిఫికేషన్‌లతో 725 కిలోమీటర్ల పరిధితో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ తాజా ఈవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టూజ్ ఈవీ బైక్ ధర, ఫీచర్ విభాగంలో అత్యుత్తమంగా ఉంటుంది. దీని డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. సాంప్రదాయ ఈవీ బైక్‌లతో పోల్చుకుంటే ఇది దాని రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ బైక్ గురించి సమాచారం ఇంకా అందుబాటులో లేదు. కానీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో అద్భుతమైన ఫీచర్లు కనిపిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అద్భుతమైన ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కంపెనీ విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా డిజిటల్ ఫీచర్లతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్ పరిధిని మెరుగుపరచడానికి కంపెనీ ఇందులో శక్తివంతమైన బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 725 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఈ బైక్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 

ఈవీ బైక్ ప్రియులు 2024లో ఎలక్ట్రిక్ బైక్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇది మంచి ఎంపికలను చెబుతుననారు. ఫీల్ టూజ్ ఈవీబైక్ గరిష్టంగా రూ.5,00,000 ధరలో అందుబాటులో ఉంటుంది. గొప్ప పరిధి, గొప్ప ఫీచర్లతో అందిరినీ ఆకట్టుకునే ఈ బైక్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో? వివరాలు తెలియలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి