Mukesh Ambani: అంబానీ ఇంట్లో చపాతీలు చేసే హెడ్ చెఫ్ జీతం ఎంతో తెలుసా? ప్యాకేజీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ హెడ్ చెఫ్ జీతం సంవత్సరానికి ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత కుబేరుడైన అంబానీ నివాసం ఆంటిలియాలో రోజుకు వందలాది చపాతీలు తయారవుతాయి. ఈ హెడ్ చెఫ్‌కు జీతంతో పాటు ఉచిత వైద్య బీమా, పిల్లల చదువుల ఖర్చులు వంటి అదనపు ప్రయోజనాలతో పాటు..

Mukesh Ambani: అంబానీ ఇంట్లో చపాతీలు చేసే హెడ్ చెఫ్ జీతం ఎంతో తెలుసా? ప్యాకేజీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Mukesh Ambani Chef Salary

Updated on: Aug 27, 2026 | 12:18 PM

Mukesh Ambani: ముఖేష్ అంబానీ… ఈ పేరు వినగానే లక్షల కోట్ల ఆస్తిపాస్తులు, ఆకాశాన్ని తాకే ఆంటిలియా భవనం గుర్తుకొస్తాయి. దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత కుబేరుడైన అంబానీ కుటుంబం నివసించే ఈ భవనం గురించి, అందులో పనిచేసే సిబ్బంది గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. మరి ఇంత పెద్ద కుబేరుడి ఇంట్లో చపాతీలు చేసే హెడ్ చెఫ్ జీతం ఎంతో మీకు తెలుసా? ఈ వివరాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.

ఇది కూడా చదవండి: House Build: ఈ మూడు రోజులలో ఇంటి నిర్మాణం చేస్తే ధనవంతులు అవుతారు..!

కొన్ని వెబ్‌సైట్లు, వివిధ కథనాల ప్రకారం.. సాధారణంగా అంబానీ కుటుంబం పూర్తి శాఖాహారులు. వారికి ఇంట్లో చేసిన పప్పు, రోటీ అంటే చాలా ఇష్టం. అంబానీ కుటుంబంతో పాటు, ఆంటిలియాలో పనిచేసే దాదాపు 600 మంది సిబ్బంది కోసం రోజుకు ఏకంగా 4000 చపాతీలు తయారు చేస్తారట. ఇంత భారీ స్థాయిలో చేతులతో చేయడం కష్టం కాబట్టి, అధునాతన యంత్రాల సహాయంతో వీటిని తయారు చేస్తారు. ఈ వంటగదిని పర్యవేక్షిస్తూ, రోటీలు తయారు చేసే బృందానికి నాయకత్వం వహించే హెడ్ చెఫ్‌కు అంబానీ ఇస్తున్న నెల జీతం అక్షరాలా రెండు లక్షల రూపాయలు. అంటే సంవత్సరానికి ఏకంగా 24 లక్షల రూపాయల ప్యాకేజీ అన్నమాట.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Old Gold Selling: బంగారం ధరలు రికార్డు స్థాయికి.. పాత బంగారాన్ని అమ్మేస్తున్న భారతీయులు.. కారణం ఇదే!

అంతేకాదు, వీరికి మెడికల్ ఇన్సూరెన్స్, వాళ్ళ పిల్లల చదువుల ఖర్చుల వంటి అనేక అదనపు ప్రయోజనాలు కూడా కల్పిస్తారు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్యాకేజీని మించి ఉన్న ఈ చెఫ్ ఉద్యోగం ఆషామాషీగా లభించదు. టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసి, ఎన్నో ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి చేస్తేనే ఈ గొప్ప అవకాశం దక్కుతుంది. అంబానీ ఇంట్లో చెఫ్‌గా పనిచేయడం అనేది కేవలం వృత్తి మాత్రమే కాదు, గౌరవం, ఉన్నత జీవనశైలికి ప్రతీక అని చెప్పవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us