Business Ideas: ఈ వ్యాపారంతో నెలకు రూ. 35 వేలు గ్యారంటీ.! వర్షాకాలంలో డబ్బే డబ్బు..

ర్షాకాలం వచ్చేసింది. దేశంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరి ఈ సీజన్‌లో మీరేదైనా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలని..

Business Ideas: ఈ వ్యాపారంతో నెలకు రూ. 35 వేలు గ్యారంటీ.! వర్షాకాలంలో డబ్బే డబ్బు..
Money

Updated on: Jun 26, 2023 | 1:45 PM

వర్షాకాలం వచ్చేసింది. దేశంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరి ఈ సీజన్‌లో మీరేదైనా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లయితే..! మీకోసం ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేశాం. దీనికి తక్కువ పెట్టుబడి పెడితే సరిపోతుంది.. కచ్చితంగా మంచి లాభాలు వస్తాయి.

వర్షాకాలంలో రెయిన్ కోట్‌లు, గొడుగులు, రబ్బర్ షూలు, వాటర్ ప్రూఫ్ బ్యాగులు లాంటివి భారీ గిరాకీగా ఉంటాయి. ఈ రెయినీ సీజన్‌లో మీరు ఈ బిజినెస్ మొదలుపెడితే.. మంచి లాభాలు ఆర్జించవచ్చు. దీనికి కేవలం రూ. 5 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ప్రతీ నెలా లక్షల్లో సంపాదించవచ్చు. ఈ బిజినెస్‌ మీరు చిన్నగా మొదలుపెట్టి.. క్రమంగా విస్తరించవచ్చు. ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా మీ మార్కెట్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు.

ఇక ఈ వ్యాపారానికి కావాల్సిన ముడి సరుకును మీరు హోల్‌సేల్ మార్కెట్‌లో కొనుగోలు చేయండి. స్వయంగా తయారు చేస్తే.. ఎక్కువ రాబడిని పొందుతారు. వీటి అమ్మకం ద్వారా మీరు ప్రతీ నెలా రూ. 15 నుంచి 35 వేల వరకు సులభంగా సంపాదించవచ్చు. మీరు ఇదే వ్యాపారాన్ని ఒకవేళ పెద్దదిగా ప్రారంభిస్తే.. నెలకు రూ. లక్ష వరకు పొందొచ్చు.