LIC: మీకు పెళ్లి అయిందా? అయితే ఓ గుడ్‌న్యూస్‌! ఇన్సూరెన్స్‌తో పాటు భారీ సేవింగ్స్‌!

LIC భార్యాభర్తల కోసం రెండు కొత్త జాయింట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను ప్రకటించింది. న్యూ జీవన్‌ సాథీ సింగిల్‌ ప్రీమియం, లిమిటెడ్‌ ప్రీమియం ప్లాన్ల ద్వారా బీమాతో పాటు గ్యారెంటీడ్‌ అడిషన్లు, మెచ్యూరిటీ బెనిఫిట్స్‌, రుణ సదుపాయం, రైడర్ల ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

LIC: మీకు పెళ్లి అయిందా? అయితే ఓ గుడ్‌న్యూస్‌! ఇన్సూరెన్స్‌తో పాటు భారీ సేవింగ్స్‌!
Lic 4

Updated on: May 25, 2026 | 9:36 PM

ప్రభుత్వరంగ జీవిత బీమా దిగ్గజం LIC కుటుంబ ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని రెండు కొత్త జాయింట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లను ప్రకటించింది. న్యూ జీవన్‌ సాథీ సింగిల్‌ ప్రీమియం (888), న్యూ జీవన్‌ సాథీ లిమిటెడ్‌ ప్రీమియం (889) పేర్లతో ఈ పాలసీలు జూన్‌ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. భార్యాభర్తలిద్దరికీ ఒకే పాలసీలో బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలు అందేలా ఈ ప్లాన్లను రూపొందించారు. ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతలను భార్యాభర్తలిద్దరూ కలిసి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇద్దరికీ ఆర్థిక రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ ప్లాన్లు తీసుకొచ్చినట్లు LIC తెలిపింది. ఈ పాలసీల్లో బీమా హామీతో పాటు గ్యారెంటీడ్ అడిషన్‌ (GA) రూపంలో అదనపు లాభం కూడా లభిస్తుంది. పాలసీ గడువు పూర్తయ్యే సమయానికి మెచ్యూరిటీ బెనిఫిట్‌ కూడా అందుతుంది.

జీవన్‌ సాథీ సింగిల్‌ ప్రీమియం-888 ప్లాన్‌లో ఒక్కసారే ప్రీమియం చెల్లించాలి. ఇది నాన్‌-పార్టిసిపేటింగ్‌, నాన్‌-మార్కెట్‌ లింక్డ్‌ ప్లాన్‌. ప్రతి రూ.1000 బీమా మొత్తానికి రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్‌ జత చేస్తారు. కనీస బీమా మొత్తం రూ.3 లక్షలు కాగా గరిష్ఠ పరిమితి లేదు. 18 ఏళ్లు పైబడిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్‌ 10 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒక భాగస్వామికి ప్రమాదం జరిగితే బీమా మొత్తం మరొకరికి చెల్లించి, పాలసీ కొనసాగుతుంది. ఇద్దరికీ ప్రమాదం జరిగితే నామినీకి సమ్‌ అష్యూర్డ్‌తో పాటు గ్యారెంటీడ్ అడిషన్‌ చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల భర్త, 32 ఏళ్ల భార్య కలిసి రూ.10 లక్షల బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే సుమారు రూ.8 లక్షల సింగిల్‌ ప్రీమియం చెల్లించాలి. పాలసీ గడువు ముగిసే సమయానికి సుమారు రూ.24 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.

ఇక జీవన్‌ సాథీ లిమిటెడ్‌ ప్రీమియం-889 ప్లాన్‌లో 5, 10 లేదా 15 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. పాలసీ టర్మ్‌ మాత్రం 10 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. మొదటి పాలసీదారుడికి ప్రీమియం చెల్లింపు కాలంలోనే రిస్క్‌ జరిగితే మిగిలిన ప్రీమియాలు మాఫీ అవుతాయి. అయినప్పటికీ పాలసీ కొనసాగుతుంది. రూ.10 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల పాలసీ తీసుకుని, 10 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే వార్షిక ప్రీమియం సుమారు రూ.1.30 లక్షలు అవుతుంది. పాలసీ పూర్తయ్యే సమయానికి గ్యారెంటీడ్ అడిషన్‌తో కలిపి సుమారు రూ.28 లక్షలు లభించే అవకాశం ఉంది. ఈ రెండు ప్లాన్లలోనూ రుణ సదుపాయం, ఇన్‌స్టాల్‌మెంట్‌ బెనిఫిట్స్‌, అలాగే యాక్సిడెంటల్‌, క్రిటికల్‌ ఇల్‌నెస్‌, టర్మ్‌ అష్యూరెన్స్‌ వంటి అదనపు రైడర్లను జోడించే వెసులుబాటు ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us