కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకునేవారికి IRCTC బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే స్పెషల్ ప్యాకేజ్.. HYD నుంచే స్టార్ట్..

కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అరుణాచలంతో పాటు కామాక్షి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే పుదుచ్చేరిలోని పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఒకే ప్యాకేజీలో ఇవన్నీ లభిస్తాయని చెప్పవచ్చు. ఫుల్ డీటైల్స్ చూద్దాం.

కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకునేవారికి  IRCTC బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే స్పెషల్ ప్యాకేజ్.. HYD నుంచే స్టార్ట్..
Arunachalam Irctc Package

Updated on: Nov 16, 2026 | 2:59 PM

కార్తీక మాసం రావడంతో అరుణాచలంలో భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దేశ నలుమూలల నుంచి భక్తులు అరుణాచలంకు క్యూ కడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలంకు బయల్దేరుతున్నారు. కార్తీక మాసం కావడంతో గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనం కోసం బారులు తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రయాణికుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ, టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తీసుకురాగా.. తాజాగా ఐఆర్‌సీటీసీ కూడా స్పెషల్ ప్యాకేజీ ప్రవేశపెట్టింది. అరుణాచలం మోక్ష యాత్ర పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అరుణాచలంతో పాటు కామాక్షి అమ్మవారు, పుదుర్చేరిలోని పర్యాటక కేంద్రాలను ఈ ప్యాకేజీలో దర్శించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడనుంది.

అరుణాచలం ప్రత్యేక ప్యాకేజ్ వివరాలు

-నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఈ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది

-ప్రతీ శుక్రవారం కాచిగూడ నుంచి రైలు బయల్దేరుతుంది. కాచిగూడ పుదుర్చేరి ఎక్స్‌ప్రెస్(17653) సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతుంది

-నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు ఈ టూర్ ఉంటుంది

-రెండ్రోజుల బస, ఉదయం టిఫిన్ ఈ ప్యాకేజీలో భాగంగా అందిస్తారు

-ట్రావెల్స్ ఇన్సూరెన్స్ కూడా టికెట్‌లో భాగంగా వర్తిస్తుంది

-దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ప్రవేశ ఛార్జీలు, ఇతర రుసుంలు ప్రయాణికులే భరించాలి

-ట్రైన్లో ధర్డ్ ఏసీ, స్లీపర్ క్లాసులో ప్రయాణం చేయవచ్చు

-స్థానికంగా ప్రయాణాల కోసం ఏసీ వెహికల్ ఉంటుంది

టికెట్ ధరలు ఇవే..

1 నుంచి ముగ్గురు వ్యక్తులకు థర్డ్ ఏసీలో ఒక్కొక్కరికి ట్విన్ షేరింగ్‌కు రూ.16,900, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13210, చైల్డ్ విత్ బెడ్ రూ.10030, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.7530గా ధరలు ఫిక్స్ చేశారు. ఇక స్టాండర్డ్ స్లీపర్ క్లాసులో ట్విన్ షేరింగ్‌కు రూ.14820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11125, చైల్డ్ విత్ బెడ్ రూ.7950, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.5450గా ఉంది. 4-6 వ్యక్తులు ఉంటే ధర్డ్ ఏసీలో ట్విన్ షేరింగ్‌లో ఒక్కొ ప్రయాణికుడికి రూ.13900, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.11920, స్టాండర్డ్ స్లీపర్ కోచ్‌లో ట్విన్ షేరింగ్‌కు రూ.11820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.9840గా నిర్ణయించారు.

ప్రయాణ షెడ్యూల్ ఇదే..

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రైలు బయల్దేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 11.05 గంటలకు పుదుర్చేరి చేరుకుంటుంది. ఆ రోజు అరోవిల్, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాతి రోజు ఉదయం అరుణాచలంలో పరమశివుడి దర్శనం ఉంటుంది. రాత్రి అరుణాచలంలో బస తర్వాత తర్వాతి రోజు కాంచీపురంకు వెళుతుంది. కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వర ఆలయం దర్శనం ఉంటుంది. అనంతరం కాచిగూడకు తిరుగు ప్రయాణం ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us