Gold: బంగారం.. దీనికి భారతీయులు (Indians) అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. భారత్‌లో కొనుగోళ్లు భారీగానే జరుగుతుంటాయి. కరోనా సమయంలో కూడా బంగారం విక్రయాలు జోరుగా సాగాయి. ఇక గత సంవత్సరం దేశంలో 797.3 టన్నుల బంగారం విక్రయాలు (Gold Sales) జరిగినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) తాజా తన నివేదిలో వెల్లడించింది. కస్టమర్ల సెంటిమెంట్ ఎక్కువగా ఉండటంతో బంగారానికి గిరాకీ పెరిగిందని తెలిపింది. ఈ ఏడాది మాత్రం సానుకూలంగా ఉంటుందని తెలిపింది. 2020లో దేశంలో (India) 446.4 టన్నుల బంగారానికి గిరాకీ ఉన్నందున దానితో పోల్చితే 2021లో 78.6 శాతం వృద్ది లభించిందని తెలిపింది.
ఇక పండగల సీజన్‌కు తోడు పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్న అక్టోబర్-డిసెంబర్ నెలలోనే 343 టన్నుల బంగారానికి గిరాకీ లభించిందని, ఇందులో భరణాల వాటా 265 టన్నులు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ సంవత్సరం బంగారానికి గిరాకీ కోవిడ్ పెరిగినా , 2021 అక్టోబరు-డిసెంబరు నాటి వినియోగస్థాయి లభించకపోవచ్చని వివరించారు. ఈ త్రైమాసికంలో పెట్టుబడుల కోసం 79 టన్నుల పసిడికి గిరాకీ ఉందని, ఇది 8 ఏళ్ల గరిష్ఠస్థాయిగా పేర్కొన్నారు. కరోనా కారణంగా వివాహాలు, ఇతర శుభకార్యాలు తక్కువ మందితో జరిగినందున, ఆదా అయిన మొత్తంతో బంగారం కొనుగోళ్లు జరిపారని పేర్కొన్నారు. అలాగే బంగారు నగల తయారీదారులు, విక్రేతదారులు హాల్‌మార్కింగ్ నిబంధనల మేరకు కొత్తనగలు తయారు చేసేందుకకు ఎక్కువ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాదిలో 800 నుంచి 850 టన్నుల బంగారం వినియోగం అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి: