
Indian Railways: ప్రస్తుతం భారతీయ రైల్వేలలో పాత ICF (Integral Coach Factory) బోగీల స్థానంలో అత్యంత ఆధునికమైన LHB (Linke-Hofmann-Busch) కోచ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇవి ప్రయాణికులకు సురక్షితమైనవి. అలాగే ప్రమాదాల సమయంలో తక్కువ నష్టం కలిగించేలా రూపొందించింది రైల్వే. అయితే, ఈ ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లలో ప్రయాణించేటప్పుడు రైలు స్టేషన్ నుండి బయలుదేరేటప్పుడు లేదా బ్రేక్ వేసి ఆగే సమయంలో ప్రయాణికులు తీవ్రమైన జరక్ (వణుకు)ని అనుభవిస్తుంటారు.
రైలు బయలుదేరినప్పుడు లేదా ఆగినప్పుడు LHB కోచ్‌లలో చాలా మంది ప్రయాణికులు ఎక్కువ కుదుపులను అనుభవిస్తారు. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి LHB కోచ్‌లకు, పాత ICF కోచ్‌లకు మధ్య ఉన్న వ్యత్యాసం. సాధారణంగా,LHB కోచ్‌లలో టైట్-లాక్ CBC లేదా సెంటర్ బఫర్ కప్లర్‌ను ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థలో కోచ్‌ల మధ్య వదులు చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా, రైలు కదలడం ప్రారంభించిన వెంటనే ఇంజిన్ లాగే శక్తి లేదా అది ఆగినప్పుడు బ్రేకుల ప్రభావం త్వరగా తర్వాతి కోచ్‌లకు చేరుతుంది. అందుకే ఈ కుదుపులు ప్రయాణికులకు తరచుగా మరింత తీవ్రంగా అనిపిస్తాయి.
Train
అయితే, ఈ కప్లింగ్ సిస్టమ్ కేవలం ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రూపొందించలేదు. దీని అతి ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి భద్రతను పెంచడం. ప్రమాదం జరిగినప్పుడు కోచ్‌లు ఒకదానిపై ఒకటి ఎక్కే ప్రమాదాన్ని తగ్గించడంలో CBC యాంటీ-క్లైంబింగ్ సిస్టమ్ సహాయపడుతుంది. ఈ భద్రతా ఫీచర్ ముఖ్యంగా హై-స్పీడ్ రైళ్ల విషయంలో చాలా ముఖ్యం.
రైలు ఇంజిన్ ముందుకు లాగడం ప్రారంభించినప్పుడు లేదా డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు, ఆ ఒత్తిడి/బలం క్షణాల్లో ఒక కోచ్ నుండి తదుపరి కోచ్‌కి వేగంగా చేరుకుంటుంది. ఈ వేగవంతమైన శక్తి ప్రసారం వల్ల ప్రయాణికులకు జరక్ లేదా ఆకస్మిక కదలిక మరింత తీవ్రంగా అనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్.. ఈ 7 టిప్స్ తెలిస్తే చాలు మరింత సేవింగ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి