క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తరచుగా తమ బిల్లులను సమయానికి చెల్లించడం మరచిపోతారు. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్న వారు వివిధ బ్యాంకుల నుండి కార్డ్‌లను ట్రాక్ చేయడంలో విఫలమవుతారు. అలాగే వాటి బిల్స్‌ను చెల్లించడంలో కొన్నింటిని మరచిపోతారు. దీంతో ఆయా బ్యాంకులు వేసే ఫైన్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది వినియోగదారు క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.అయితే క్రెడిట్ కార్డ్ బిల్లుల్లో గడువు తేదీని మిస్ అయిన వారికి సులభమైన పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం వినియోగదారులకు ఎలాంటి పెనాల్టీని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం పడకుండా ఉంటుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకారం ఒక వినియోగదారు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపును గడువు తేదీ లోపు చేయకపోతే వారు గడువు ముగిసిన మూడు రోజులలోపు బిల్లును క్లియర్ చేయవచ్చు. ఈ విధంగా, బ్యాంకులు పెనాల్టీని వసూలు చేయలేవు. వినియోగదారు క్రెడిట్ స్కోర్ కూడా ప్రభావితం కాకుండా ఉంటుంది. ఉదాహరణకు, మీ గడువు తేదీ ఆగస్టు 05 అంటే మీరు బిల్లును ఆగస్టు 08 లోపు బిల్లును చెల్లించవచ్చు. ఇలా చేస్తే ఎటువంటి పెనాల్టీని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపకుండా ఉండవచ్చు.
మీరు మూడు రోజుల గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లును క్లియర్ చేయడంలో విఫలమైతే బ్యాంకులు వేసే ఫైన్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇది క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. దీన్ని వల్ల భవిష్యత్‌లో రుణాలు పొందడం క్లిష్టతరం కావచ్చు. మూడు రోజుల డెడ్‌లైన్ పోస్ట్ గడువు తేదీ తర్వాత బిల్లులను క్లియర్ చేస్తే బ్యాంక్ నుంచి ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తుంది. అది వినియోగదారు తదుపరి బిల్లుకు జోడిస్తారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో జాబితా చేసిన చెల్లింపు గడువు తేదీ నుంచి ప్రారంభమయ్యే గడువు తేదీ, ఆలస్య చెల్లింపు ఖర్చుల సంఖ్యను దాటిన రోజులు లెక్కించబడతాయి. ఆలస్య రుసుము ఛార్జీలు, అపరాధ వడ్డీ, ఇతర ఛార్జీలు గడువు తేదీ తర్వాత బకాయి ఉన్న మొత్తంపై మాత్రమే జారీ చేస్తారు.
పెనాల్టీ మొత్తాలు వినియోగదారు క్రెడిట్ కార్డ్ బిల్లుపై ఆధారపడి ఉంటాయి, ఎక్కువ బిల్లింగ్ మొత్తం, ఆలస్య రుసుము లేదా పెనాల్టీ మొత్తం ఎక్కువగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు బకాయి మొత్తం రూ. 500 నుంచి రూ. 1000 మధ్య ఉంటే రూ. 400 జరిమానా విధిస్తుంది. ఆ మొత్తం రూ. 1,000, రూ. 10,000 మధ్య ఉంటే (కచ్చితంగా చెప్పాలంటే 9,999), పెనాల్టీ 750 వసూలు చేస్తారు. అదేవిధంగా, రూ. 25,000 బకాయి మొత్తం రూ. 50,000 కంటే తక్కువ, రూ. 1,100 జరిమానా విధిస్తారు. రూ.50,000 కంటే ఎక్కువ ఏదైనా ఉంటే ఎస్‌బీఐ నుంచి రూ. 1,300 జరిమానా విధిస్తారు. వివిధ బ్యాంకులు బిల్లు మొత్తాన్ని బట్టి వేర్వేరు మొత్తంలో జరిమానాలు విధిస్తాయి. కొన్ని బ్యాంకులు ఇతరులకన్నా ఎక్కువ జరిమానాలు విధిస్తాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం