Indian Passport: భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం.. పూర్తి జాబితా ఇదే..!

Indian Passport: అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక ప్రధాన దేశాలకు వెళ్లేందుకు భారతీయులు ముందుగానే వీసా పొందాల్సి ఉంటుంది. భారత పాస్‌పోర్ట్‌తో ప్రస్తుతం 26 దేశాలకు వీసా లేకుండా లేదా సులభమైన ప్రవేశ సౌకర్యాలతో..

Indian Passport: భారత పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతం? 26 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం.. పూర్తి జాబితా ఇదే..!
Indian Passport

Updated on: Jul 06, 2026 | 10:42 AM

Indian Passport: విదేశాలకు వెళ్లాలనుకునే ప్రతి భారతీయుడికి పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన పత్రం. అయితే భారత పాస్‌పోర్ట్‌తో ఎన్ని దేశాలకు వీసా లేకుండానే వెళ్లవచ్చు? ప్రపంచవ్యాప్తంగా భారత పాస్‌పోర్ట్‌కు ఎంత గుర్తింపు ఉంది? తాజాగా విడుదలైన గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 ఈ విషయాలపై ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం, భారత పాస్‌పోర్ట్ ప్రపంచ ర్యాంకింగ్‌లో 125వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం వెనక్కి పడింది. అయినప్పటికీ, భారతీయులు 26 దేశాలకు వీసా లేకుండానే లేదా ప్రత్యేక అనుమతులతో సులభంగా ప్రయాణించే అవకాశం కలిగి ఉన్నారు.

వీసా లేకుండా వెళ్లగల 6 దేశాలు

  • భూటాన్
  • జమైకా
  • మకావు
  • నేపాల్
  • పాలస్తీనా
  • ట్యునీషియా

పరిమిత కాలం పాటు వీసా లేకుండా ప్రవేశం కల్పించే 20 దేశాలు:

  • అంగోలా
  • బార్బడోస్
  • డొమినికా
  • ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా
  • ఫిజీ
  • గాంబియా
  • గ్రెనడా
  • హైటి
  • కజకిస్తాన్
  • కిరిబాటి
  • మలేషియా
  • మాల్దీవులు
  • మారిషస్
  • ఖతార్
  • రువాండా
  • సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్
  • సెనెగల్
  • థాయ్‌లాండ్
  • ట్రినిడాడ్ అండ్ టొబాగో
  • వనాటు
  • వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival) అందించే దేశాలు
  • కొమొరోస్
  • ఈస్ట్ టిమోర్
  • గినియా-బిస్సావు
  • ఇండోనేషియా
  • లైబీరియా
  • మార్షల్ దీవులు
  • పలావు
  • సెయింట్ లూసియా
  • సమోవా
  • టువాలు

ఈ ప్రధాన దేశాలకు మాత్రం ముందుగానే వీసా అవసరం

అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక ప్రధాన దేశాలకు వెళ్లేందుకు భారతీయులు ముందుగానే వీసా పొందాల్సి ఉంటుంది. భారత పాస్‌పోర్ట్‌తో ప్రస్తుతం 26 దేశాలకు వీసా లేకుండా లేదా సులభమైన ప్రవేశ సౌకర్యాలతో ప్రయాణించవచ్చు. అయితే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక, అభివృద్ధి చెందిన దేశాలకు ఇప్పటికీ ముందస్తు వీసా తప్పనిసరి. భవిష్యత్తులో ద్వైపాక్షిక ఒప్పందాలు పెరిగితే భారతీయులకు మరిన్ని దేశాల్లో వీసా సౌకర్యాలు లభించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై బంపర్‌ ఆఫర్‌.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్‌..!

ఇది కూడా చదవండి: India Billionaires: మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us