Rent: అద్దెకు ఉండే వారికి కూడా ఈ హక్కులుంటాయని తెలుసా.?

|

Oct 09, 2024 | 8:17 PM

భారత్‌లో సొంతిళ్లలో నివసించే వరి కంటే అద్దె ఇంట్లో నివసించే వారి సంఖ్యే ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇంటి యజమానికి హక్కులు ఉన్నట్లే అద్దెకు ఉంటున్న వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయని మీకు తెలుసా.? అద్దె ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలే కాకుండా, అదనపు షరతులు కూడా వర్తిస్తాయి...

Rent: అద్దెకు ఉండే వారికి కూడా ఈ హక్కులుంటాయని తెలుసా.?
House Rent
Follow us on

భారత్‌లో సొంతిళ్లలో నివసించే వరి కంటే అద్దె ఇంట్లో నివసించే వారి సంఖ్యే ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇంటి యజమానికి హక్కులు ఉన్నట్లే అద్దెకు ఉంటున్న వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయని మీకు తెలుసా.? అద్దె ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలే కాకుండా, అదనపు షరతులు కూడా వర్తిస్తాయి. అయితే అద్దెకు ఉండే వారి ప్రయోజనాలను కాపాడేందుకు గాను కొన్ని రకాలను కల్పించాలరు. ఇంతకీ ఆ హక్కులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇల్లు అద్దెకు ఇచ్చిన తర్వాత సదరు ఇల్లు అద్దెకు తీసుకున్న వారి నివాసంగా మారుతుంది. కాబట్టి రెంట్‌ తీసుకున్న వారి గోప్యత విషయంలో ఇంటి ఓనర్‌ జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అద్దెకు ఉంటున్న వారి రోజువారీ కార్యకలాలపై పరిమితులు వధించే హక్కు ఇంటి ఓనర్‌కు ఉండదు.

* ఇంటి ఓనర్‌ అన్న పేరుతో ఎప్పుడు పడితే అప్పుడు.. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడానికి కుదరదు. ఇంట్లోకి వచ్చే ముందు కచ్చితంగా అద్దెదారు అనుమతి తీసుకోవాల్సిందే.

* అలాగే ఎప్పుడుపడితే అప్పుడు అద్దెకున్న వారిని ఇంట్లోని పంపించడానికి కూడా ఆస్కరం ఉండదు. ఇల్లు ఖాళీ చేయడానికి అద్దెదారుడికి కనీసం 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. ఇక ఒకవేళ రెంటుకు ఉన్న వ్యక్తి రెండు నెలలకు మించి అద్దె చెల్లించకపోయినట్లే యజమాని మిమ్మల్ని ఇంటిని ఖాళీ చేయించే అధికారం ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.

* యజమాని ఇష్టానుసారంగా అద్దెను పెంచే హక్కు కూడా ఏదు. మార్కెట్‌ ధరను బట్టే అద్దెను నిర్ణయించాలి. అద్దె పెంచే ముందు యజమాని అద్దెదారుడికి మూడు నెలల ముందే విషయాన్ని వెల్లడించాలి. 1948 అద్దె నియంత్రణ చట్టంలో ఈ విషయాలను స్పష్టంగా వెల్లడించారు. దీని ప్రకారం అద్దెకు తీసుకునే ముందు లిఖితపూర్వక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది.

* ఇంటి మరమ్మత్తులు, నిర్వహణ ఖర్చుతో పాటు ఇంటి పన్నులను పూర్తిగా ఇంటి యజమాని స్వయంగా భరించాల్సి ఉంటుంది. అలాగే ఇంటిని అద్దెకు తీసుకునే ముందు ఇచ్చిన సెక్యూరిటీ లపాజిట్‌ను ఇల్లు ఖాళీ చేసే సమయంలో తిరిగి చెల్లించాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..